యూపీలో ఎస్పీ - బీఎస్పీకి పెరగనున్న స్థానాలు!

Sun,May 19, 2019 07:21 PM

Uttar Pradesh Exit Poll Results

హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ ప్రజలు మరోసారి మోదీ సర్కార్‌కే మద్దతిచ్చారు. అయితే 2014 సాధారణ ఎన్నికల సమయంలో వచ్చిన స్థానాల కంటే ఈ సారి బీజేపీకి కొన్ని స్థానాలు తగ్గే అవకాశం ఉందని టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. మొత్తం 80 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 2014లో బీజేపీ 80 స్థానాలకు గానూ 73 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు 73 నుంచి 56 స్థానాలకు తగ్గే అవకాశం ఉందని టైమ్స్ నౌ సర్వే తెలిపింది. సమాజ్‌వాదీ పార్టీ - బహుజన్ సమాజ్ పార్టీ 20 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. కాంగ్రెస్ రెండు స్థానాల్లోనే గెలిచే అవకాశం ఉందని తెలిపింది. 2014 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ రాయ్‌బరేలీ, అమేథి స్థానాల్లో మాత్రమే గెలిచింది.

1831
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles