తినడానికి లడ్డూలే ఇస్తుందని.. విడాకులు కోరాడు..

Tue,August 20, 2019 01:52 PM

Uttar Pradesh Man Seeks Divorce Says Wife Only Gives Him Laddoos To Eat

లక్నో : తనకు తినడానికి లడ్డూలు మాత్రమే ఇస్తుందని.. అవి సరిపోవడం లేదని.. తన భార్య నుంచి విడాకులు కావాలని భర్త కోరాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ జిల్లాలో చోటు చేసుకుంది. మీరట్‌కు చెందిన ఓ వ్యక్తికి పదేళ్ల క్రితం వివాహమైంది. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే గత కొంతకాలం నుంచి భర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో భార్య.. ఓ మంత్రగాడిని సంప్రదించి.. అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తను బాగు చేయాలని కోరింది.

భర్త ఆరోగ్యం బాగు కావాలంటే.. రోజుకు ఎనిమిది లడ్డూలు మాత్రమే అతనికి ఆహారంగా ఇవ్వాలని మంత్రగాడు ఆమెకు చెప్పాడు. ఉదయం, సాయంత్రం నాలుగు చొప్పున మాత్రమే ఇవ్వాలని సూచించారు. లడ్డూలే అతనికి ఆహారం. అయితే ఈ లడ్డూలు అతనికి సరిపోవడం లేదు. తిండికి ఇబ్బంది పెడుతున్న తన భార్య నుంచి విడాకులు కావాలని భర్త ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. భర్త ఫిర్యాదు విన్న అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో భార్యభర్తలిద్దరికీ అధికారులు కౌన్సెలింగ్‌ ఇచ్చి ఇంటికి పంపించారు.

2090
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles