బైక్‌కు మంటలు.. ఇద్దరిని కాపాడిన పోలీసులు.. వీడియో

Mon,April 15, 2019 05:34 PM

Uttar Pradesh police chase down bike on fire save lives of two

లక్నో : ఓ బైక్‌పై ఇద్దరు వ్యక్తులు శరవేగంతో దూసుకుపోతున్నారు. ఆ బైక్ సైలెన్సర్‌పై ఉన్న బట్టల సంచికి మంటలు అంటుకున్నాయి. దీన్ని గమనించిన పోలీసులు.. తమ వాహనంతో ఆ బైక్‌ను ఛేజ్ చేసి ఇద్దరి ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన యూపీలోని ఇటవా హైవేపై చోటు చేసుకుంది. పోలీసులు తమ వాహనంలో వెళ్తూ బైక్‌కు మంటలు అంటుకున్నాయి.. ఆపండి అంటూ ఆ ఇద్దరిని అప్రమత్తం చేశారు. దీంతో ఒక్కసారిగా బైక్‌ను ఆపి వారు పరుగులు పెట్టారు. పోలీసులు బైక్‌కు అంటుకున్న మంటలను ఆర్పివేశారు. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు.2871
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles