ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఒక వినూత్న ప్రయోగం

Sat,June 8, 2019 03:26 PM

vijay sai reddy comments on YS Jagan Cabinet Ministers

అమ‌రావ‌తి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహ‌న్‌రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గం కొలువుదీరింది. మొత్తం 25 మంది మంత్రులతో ఏపీ కేబినెట్‌ను శనివారం ఏర్పాటు చేశారు. జగన్‌ తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన మంత్రులందరికీ వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య సాయిరెడ్డి శుభాభినందనలు తెలిపారు. ట్విట‌ర్‌లో ఆయ‌న స్పందిస్తూ.. మన ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అన్ని వ్యవస్థలు నిస్తేజంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో జగన్‌ ఆలోచనల మేరకు, ప్రజానీకానికి ఇచ్చిన హామీలు వేగంగా నెరవేర్చే దిశగా మంత్రులు దృఢ సంకల్పంతో పనిచేయాలి. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ దేశానికే దిక్సూచిగా మారుతుంది. అభివృద్ధి వైపు అడుగులు మొదలయ్యాయి. గడచిన ఐదేళ్ల పీడకలను ప్రజలు మర్చిపోయేలా జ‌గ‌న్ చేస్తారు. ఎక్కడా దాపరికం లేని పారదర్శకత కనిపిస్తుంది. ప్రతీ కార్యక్రమంలోనూ ప్రజల భాగస్వామ్యం ఉండేలా యువ ముఖ్య‌మంత్రి ప్రణాళికలు సిద్ధం చేశారు.


మంత్రివర్గం కూర్పులో సామాజిక సమతుల్యతకు పెద్ద పీట వేస్తూ సీఎం జగన్‌ దేశంలోనే ఒక మోడల్‌ కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఒక వినూత్న ప్రయోగమనే చెప్పాలి. అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మంత్రులంతా ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా శ్రమించాలని విజ‌య సాయిరెడ్డి కోరారు.

3873
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles