మా సీఎం వచ్చాడు.. కళ్లలో పెట్టుకుని కాపాడ‌తాడు..!

Sat,June 1, 2019 05:13 PM

Vijaya sai Reddy comments on ap cm jagan key decisions

అమ‌రావ‌తి: జన్మభూమి కమిటీల మాఫియా రాజ్యానికి కాలం చెల్లిందని వైసీపీ నేత‌, ఎంపీ విజ‌య సాయిరెడ్డి అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి నాయ‌క‌త్వంలో రాష్ట్రం అభివృద్ధి ప‌థంలో దూసుకెళ్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. గ‌త పాల‌కుల వ‌ల్ల రాష్ట్ర ప్ర‌జ‌లు దోపిడీకి గుర‌య్యార‌ని విమ‌ర్శించారు. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత జ‌గ‌న్ తీసుకున్న ప‌లు విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాల‌పై ట్విట‌ర్ వేదిక‌గా స్పందించారు.

జన్మభూమి కమిటీల మాఫియా రాజ్యానికి కాలం చెల్లింది. గ్రామ సచివాలయాల ద్వారా సంక్షేమ పథకాలన్నీ ప్రజల గడప వద్దకు వెళ్తాయి. చంద్రబాబు హయాంలో నేతలు వందల, వేల కోట్లు పోగేసుకున్నారు. పేదల జీవితాలు అస్థవ్యస్తమయ్యాయి. మా సీఎం వచ్చాడు. కళ్లలో పెట్టుకుని కాపాడతాడనే భరోసా ఇప్పుడు అంద‌రిలో కనిపిస్తోంది. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లను భారీగా పెంచిన రాష్ట్రంగా ఏపీ దేశంలోనే చరిత్ర సృష్టించింది. కిడ్నీబాధితుల సమస్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నావారంతా సిగ్గు పడాలి. నేను చూశాను. యువ ముఖ్యమంత్రి జ‌గ‌న్‌.. నేను ఉన్నాను అంటూ నెలకు పదివేల ఆసరా కల్పించారు.

దుబారా ఖర్చులను ముఖ్య‌మంత్రి జగన్ కట్టడి చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇది స్పష్టంగా కనిపించింది. ప్రతి రూపాయి వ్యయానికి అకౌంటబులిటీ ఉంటుంది. హిమాలయా వాటర్ బాటిల్స్ కనిపించవిక. రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలిసి కూడా గత ప్రభుత్వం విలాసాలు వదులుకోలేదు. అని మండిప‌డ్డారు.

6137
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles