పాలకుడికి, మ్యానిపులేటర్‌కి తేడా ఇదే బాబూ..!

Mon,June 10, 2019 05:21 PM

vijaya sai reddy comments on chandrababu naidu

అమ‌రావ‌తి: తమ వేతనాన్ని 3 వేల నుంచి 6 వేలకు పెంచాలని ధర్నా చేసిన 'ఆశా' అక్కా చెల్లెళ్లపై మహిళా దినోత్సవం రోజునే పోలీసులను ఉసిగొల్పి మాజీ సీఎం చంద్ర‌బాబు అరెస్ట్ చేయించాడ‌ని ఎంపీ విజ‌య సాయిరెడ్డి ఆరోపించారు. ముఖ్య‌మంత్రి జగన్ మోహ‌న్‌రెడ్డి ముందస్తు హామీ ఇవ్వకున్నా వారి వేతనాలను 300% పెంచుతూ కొత్త ఆశలు నింపారని తెలిపారు. పాలకుడికి, మ్యానిపులేటర్‌కి తేడా ఇదే బాబూ అని ట్వ‌ట‌ర్ వేదిక‌గా ధ్వ‌జ‌మెత్తారు.

విజ‌య సాయిరెడ్డి ఏమ‌న్నారంటే.. రాష్ట్రాభివృద్ధికి తన సహకారం సదా ఉంటుందని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. స్పెషల్ స్టేటస్‌తో సహా ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు ఆయన తోడ్పాటునిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. జగన్‌ యజ్ఞంలా చేపట్టిన కార్యక్రమాలకు కేంద్రం బాసటగా నిలవాలి. జగన్ కేబినెట్లో 60% మంత్రులు అణగారిన వర్గాలకు చెందిన వారే. దేశంలో దళితులు, బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇది ఖచ్చితంగా బలహీనవర్గాల ప్రభుత్వమే. బీసీలకు 50% నామినేషన్ పనులు కేటాయించి ఆర్థికంగా ఎదిగేలా చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో బీసీలు, కాపులను ఉద్ధరిస్తానని కోతలు కోసిన చంద్రబాబుకు జగన్ కేబినెట్ కూర్పుపై ప్రశంసించడానికి ఒక్క మాట రావడం లేదు. సామాజికంగా అణిచివేతకు గురైన వారికి నాలుగు ఉప ముఖ్యమంత్రి పదవులివ్వడంపై ఏ వ్యాఖ్యా చేయకుండా మౌనీ బాబా అయ్యారు చంద్ర‌బాబు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

5411
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles