లోకేష్‌కు ప్రకాశం బ్యారేజీ.. చంద్రబాబుకు పోలవరం ప్రాజెక్టు

Fri,June 7, 2019 03:12 PM

Vijaya Sai Reddy Counters chandraBabus Letter

అమరావతి: టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలపై వైసీపీ నేత‌, ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విటర్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్ర‌జావేదిక భ‌వ‌నాన్ని ప్ర‌తిప‌క్ష పార్టీ టీడీపీకి కేటాయించాల‌ని మాజీ సీఎం చంద్ర‌బాబు.. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు లేఖ రాసిన నేప‌థ్యంలో విజ‌య సాయిరెడ్డి స్పందించారు. యనమల తనపై చేసిన వ్యాఖ్యలకు మరోసారి ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

విజ‌య సాయిరెడ్డి ఏమ‌న్నారంటే.. యనమల గారూ... మీరు అడగటం, మేం ఇవ్వటం మొదలుపెడితే లోకేష్‌ కోసం ప్రకాశం బ్యారేజీ, చంద్రబాబు కోసం పోలవరం ప్రాజెక్టు కూడా ఇవ్వమని అడగగల సమర్ధులు మీరు! ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా చంద్రబాబు గారూ? కుప్పం, చంద్రగిరిలో నాయకులు అడ్డగోలుగా దోచుకోవడం వల్లే ప్రజలు పార్టీకి దూరమయ్యారని సమీక్షల్లో మీరు ఆవేదన చెందినట్టు మీడియాలో చూసి అంతా నవ్వుకుంటున్నారు. జన్మభూమి కమిటీలనే పచ్చ మాఫియాను సృష్టించి ఇప్పుడు నీతులు చెబితే ఏం లాభం? పేరుకు ఆర్థిక మంత్రిగా ఉన్నా అంతా కుటుంబరావే చూసుకోవడం వల్ల యనమలకు లెక్కలపై పట్టుతప్పింది. ప్రజావేదిక కేటాయించాలని బాబు రాసింది మొదటి లేఖ కాదు. శుభాకాంక్షలు తెలిపేందుకు రాసింది ఫస్ట్ లెటర్ అని సమర్ధించబోయారు. మరి బాబు రాసిన లేఖపై DO లెటర్ 1/2019 అని ఎందుకుందో చెప్పాలి. అని విమ‌ర్శించారు.7550
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles