‘కే’ ట్యాక్స్ పేరుతో వందల కోట్లు దోచుకున్నారు..!

Sun,June 9, 2019 12:48 PM

Vijaya Sai Reddy Tweets on Kodela Family Corruption

అమ‌రావ‌తి: ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద రావు కుటుంబం ‘కే’ ట్యాక్స్ పేరుతో వందల కోట్లు దోచుకున్నారని వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ఆరోపించారు. దోపిడీకి సహకరించిన అధికారులు కూడా దోషులేనని, నిర్బంధ వసూళ్ల మాఫియా అరాచకాలపై దర్యాప్తు జరుగుతుందని స్ప‌ష్టం చేశారు. బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని ట్విటర్‌ వేదికగా పిలుపునిచ్చారు.

కోడెల అరాచకాలపై విజ‌య సాయిరెడ్డి ట్విట‌ర్లో ధ్వజమెత్తారు. ప్రజలు, వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేసిన కోడెల కుటుంబ సభ్యులెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరు. ‘కే’ ట్యాక్స్ పేరుతో వందల కోట్లు దోచుకున్నారు. దీనికి సహకరించిన అధికారులు కూడా దోషులే. నిర్బంధ వసూళ్ల మాఫియా అరాచకాలపై దర్యాప్తు జరుగుతుంది. బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి. ఎన్నికల్లో ఎలాగోలా గెలవాలని 99% రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో సాధ్యంకాని హామీలను గుప్పిస్తాయి. చంద్రబాబులాంటి వారు గెలిచాక మేనిఫెస్టోను మాయం చేయడం కూడా చూశాం. ముఖ్య‌మంత్రి జగన్ మోహ‌న్‌రెడ్డి మాత్రం దాన్నో పవిత్ర గ్రంథంలా భావిస్తున్నారు. నవరత్నాల అమలుతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయ‌ని పేర్కొన్నారు.

4883
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles