ఈ ఊరు గూగుల్ మ్యాప్‌లో లేదు..

Tue,September 29, 2015 08:34 PM

village Listed in Wikipedia

ఆ ఊళ్లో ఆడపిల్లలు చదవు కొనసాగించడమంటే గగనమే! ఎందుకంటే పది మందిలో ఆరుగురికి బాల్యవివాహాలు జరుగుతాయి. ఎక్కడ అది అనుకుంటున్నారా? జార్ఖండ్‌లోని ఓ చిన్న కుగ్రామం.. హుటుప్. అక్కడ ఒక ఎన్జీవో ఆడపిల్లలకు ఉన్నత విద్య అందేలా ప్రయత్నిస్తోంది.

ఆ ఎన్జీవో పేరు యువ. ఇప్పటి దాకా ఈ ఊరు గూగుల్ మ్యాప్‌లో లేదు. దాన్ని అందులో పొందుపరిచే ప్రాజెక్ట్‌ని ఈ పిల్లలకు అప్పగించారు. అంతేకాదు.. ఆ ఊరి వివరాలను కూడా పిల్లలే అప్‌లోడ్ చేసేలా శిక్షణనిచ్చారు. మొత్తానికి ఇప్పుడు ఆ ఊరు వికిపీడియాలో చేరిపోయింది. ఆ ఊళ్లోని స్కూళ్లు, ఆసుపత్రులు, ఆటలు అన్నింటినీ ఫొటోలతో సహా పొందుపరిచారు ఆ పిల్లలు.

వీళ్లు టెక్నాలజీ పరంగానే కాదు, ఆడపిల్లలకి ఫుట్‌బాల్ ఆటలోనూ శిక్షణ ఇస్తున్నారు. ఆ ఊరు పిల్లలు 2013లో స్పెయిన్‌లో జరిగిన ఒక మ్యాచ్‌లో రజతం, యూఎస్‌ఏలో జరిగినా మ్యాచ్‌లోనూ పాల్గొన్నారు. ఈ ఊళ్లోని చదువు మధ్యలో ఆపేసి, స్కూల్ ఫీజ్ కట్టలేని ఆడపిల్లలని, చిన్న పిల్లలకి మెంటార్‌గా నియమించారు. వారికి ఈ ఎన్జీవో నుంచి కొంత మొత్తంలో డబ్బు అందుతుంది. అలా వాళ్లు కూడా తమ చదువును నిరాటంకంగా కొనసాగేలా చేస్తోంది యువ. ఈ ఎన్జీవో ఇంకా లీడర్‌షిప్ ట్రైనింగ్, అకడమిక్ ఎక్స్‌లెన్సీ, ఫుట్‌బాల్ కోసం ఒక పెద్ద హబ్‌ని ఏర్పాటు చేసే దిశలో అడుగులు వేస్తోంది.

2350
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles