హెచ్‌సీఏ ఎన్నిక‌లు.. పోలైన 224 ఓట్లు

Fri,September 27, 2019 03:48 PM

హైద‌రాబాద్‌: ఉప్ప‌ల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఇవాళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఎన్నికలు జ‌ర‌గాయి. ఈ ఎన్నిక‌ల్లో 227 ఓట్ల‌కు గాను, 224 మంది స‌భ్యులు ఓటేశారు. చివ‌రి నిమిషంలో వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ ఓటేశారు. ఇవాళ సాయంత్రం 5 గంట‌ల‌కు ఫ‌లితాల‌ను ప్ర‌క‌టిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎన్నికలను నిర్వహించారు. భారత మాజీ కెప్టెన్ అజరుద్దీన్, ప్రకాశ్‌చంద్ జైన్, దిలీప్ కుమార్ మధ్య త్రిముఖ పోటీ నెలకొన్నది. ఈసారి ఎలాగైనా హెచ్‌సీఏ పీఠాన్ని కైవసం చేసుకోవాలని అజర్ పట్టుదలతో కనిపిస్తుంటే..మాజీ అధ్యక్షుడు వివేక్ మద్దతుతో జైన్ పావులు కదుపుతున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాతిరి బాబురావు సాగర్ ప్యానెల్ అవినీతి నిర్మూలనే ప్రధాన ఏజెండాగా బరిలోకి దిగుతున్నది. ఈ ఎన్నికలో 155 ప్రైవేట్ క్లబ్‌లకు చెందిన ప్రతినిధులతో పాటు 51 ఆయా సంస్థల క్లబ్‌లు, తొమ్మిది జిల్లా క్రికెట్ సంఘాలు, 11 మంది మాజీ క్రికెటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. హెచ్‌సీఏ అధ్య‌క్ష ప‌ద‌వికి అజ‌రుద్దీన్ తీవ్ర పోటీ ఇస్తున్నారు. శివ‌లాల్ యాద‌వ్‌, వెంక‌ట‌ప‌తి రాజు, అర్ష‌ద్ అయూబ్‌, మాజీ ఎంపీ వివేక్‌, మాజీ ఎంపీ హ‌న్మంత‌రావు ఓటేశారు.

1064
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles