వడదెబ్బ.. నీటి ఎద్దడి.. 40 నుంచి 50 కోతులు మృతి

Wed,June 12, 2019 12:20 PM

water scarcity kills monkeys in Damoh Madhya Pradesh

భోపాల్ : మండుటెండలకు మనషులు ఒక్కరే కాదు.. మూగ జీవాలు కూడా బలవుతున్నాయి. వడదెబ్బకు తోడు నీటి ఎద్దడి ఉండడంతో జీవాలు విలవిలలాడుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లో వడదెబ్బ, నీటి ఎద్దడి కారణంగా గత వారం రోజుల నుంచి ఇప్పటి వరకు 40 నుంచి 50 కోతులు మృతి చెందినట్లు స్థానికులు వెల్లడించారు. ఉత్తరాది రాష్ర్టాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. ఈ కారణంగా ఎండ వేడిమికి కోతులు చనిపోతున్నట్లు వారు తెలిపారు. ఇక ఆవులు, కుక్కలు అనారోగ్యానికి గురవుతున్నాయని చెప్పారు. కోతుల మృతితో దామోహ్ ప్రాంతమంతా కాలుష్యమైందని స్థానికులు వాపోయారు. అటవీశాఖ అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు.

2233
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles