మహారాష్ట్రలో ఏర్పాటయ్యేది బీజేపీ ప్రభుత్వమే..

Fri,November 15, 2019 06:34 PM


ముంబై: మహారాష్ట్రలో బీజేపీ లేకుండా ప్రభుత్వ ఏర్పాటు ఉండబోదని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ స్పష్టం చేశారు. బీజేపీకే సంఖ్యాబలం అధికంగా ఉందని, 119 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కృతనిశ్చయంతో ఉన్నామని, ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వ ఏర్పాటు ఖాయమన్నారు.


ఇదిలా ఉంటే మరోవైపు శివసేన, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ), కాంగ్రెస్‌ పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖరారైనట్టేనని వార్తలు వస్తున్నాయి. ఈ మూడు పార్టీల నాయకులు కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ-105, శివసేన-56, ఎన్సీపీ-54, కాంగ్రెస్-44 స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే.

1516
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles