సిద్ధార్థ విషయంలో చట్టప్రకారమే వ్యవహరించాం

Tue,July 30, 2019 08:35 PM

బెంగళూరు: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ సీఎం ఎస్.ఎం. కృష్ణ అల్లుడు వి.జి.సిద్ధార్థ ఆచూకీ కోసం పోలీసుల గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. అదృశ్యమయ్యే ముందు సిద్ధార్థ సిబ్బందికి లేఖ రాసిన విషయం తెలిసిందే. లేఖలో తన ఆర్థిక సమస్యలు ప్రస్తావించాడు. ఐటీశాఖ డీజీ వేధింపులు అధికమయ్యాయని లేఖలో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో వి.జి.సిద్ధార్థ వ్యవహారంపై ఆదాయపన్నుశాఖ అధికారులు స్పందించారు. సిద్దార్థను ఐటీశాఖ ఎలాంటి ఇబ్బందులకు గురిచేయలేదన్నారు. సిద్ధార్థ విషయంలో చట్టప్రకారమే వ్యవహరించినట్లు పేర్కొన్నారు. మైండ్ ట్రీలో వాటాల విక్రయం ద్వారా సిద్ధార్థ రూ.3,200 కోట్లు ఆర్జించినట్లుగా తెలిపారు. కాగా రూ.300 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉంటే రూ.46 కోట్లే చెల్లించినట్లు చెప్పారు. లేఖలో సిద్ధార్థ సంతకం తమ రికార్డుల్లోని సంతకంతో సరిపోలడం లేదని అధికారులు పేర్కొన్నారు.

1245
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles