సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం.. అయోధ్య వివాదం ముగిసింది: ఆర్‌ఎస్‌ఎస్

Sat,November 9, 2019 01:19 PM

హైదరాబాద్: వివాదాస్పద అయోధ్య స్థలంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. సుప్రీం తీర్పు వెల్లడి నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు అందరికీ ఆమోదయోగ్యమైన తీర్పు ఇచ్చిందన్నారు. అందరూ ఐక్యంగా ఉండి రామ మందిర నిర్మాణం చేపట్టాలన్నారు. తీర్పును గెలుపు, ఓటమిలా చూడొద్దన్నారు. తీర్పుతో అయోధ్య వివాదం ముగిసిందని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సామరస్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ చేసే ప్రయత్నాలను తాము స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు.

1602
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles