మోదీ విమానానికి దారివ్వం..

Wed,September 18, 2019 07:51 PM

హైద‌రాబాద్‌: ప్ర‌ధాని మోదీ ప్ర‌యాణించే విమానం కోసం త‌మ గ‌గ‌న‌త‌ల మార్గాన్ని ఇవ్వ‌బోమ‌ని పాకిస్థాన్ స్ప‌ష్టం చేసింది. ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి షా మెహ‌బూద్ ఖురేషీ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. భార‌తీయ హై క‌మిష‌న్‌కు ఈ విష‌యాన్ని చేర‌వేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. అమెరికాలో జ‌ర‌గ‌నున్న హౌదీ మోదీ స‌భ కోసం ప్ర‌ధాని మోదీ వెళ్ల‌నున్నారు. అయితే పాక్ గ‌గ‌న‌త‌లం మీదుగా మోదీ విమానం వెళ్ల‌వ‌ల‌సి ఉన్న‌ది. ఇటీవ‌ల రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో పాక్ గ‌గ‌న‌త‌లంపై ఆంక్ష‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో మోదీ విమానం ప్ర‌యాణించేందుకు పాక్ ప‌ర్మిష‌న్ కోరింది భార‌త్‌. కానీ ఆ అభ్య‌ర్థ‌న‌కు పాక్ నో చెప్పింది.

2372
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles