70 సీట్లు గెలవాలి : ఢిల్లీ సీఎం

Fri,August 16, 2019 04:11 PM

we will win 70 seats

న్యూఢిల్లీ: వచ్చే సంవత్సరం జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్(ఆమ్ ఆద్మీ పార్టీ) అన్ని సీట్లు గెలుచుకుంటుందని పార్టీ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన పార్టీ కార్యకర్తలతో ఆయన పైవిధంగా అన్నారు. నేటితో కేజ్రీవాల్ 51సంవత్సరాల వయస్సులోకి ప్రవేశించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 67 స్థానాలు గెలుచుకున్న ఆప్.. ఈసారి క్లీన్‌స్వీప్ చేయాలని పార్టీ శ్రేణులకు సీఎం పిలుపునిచ్చారు.

కేజ్రీవాల్ పుట్టిన రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు చెప్పారు. కేజ్రీవాల్ ఆయురారోగ్యాలతో చిరకాలం జీవించాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ ట్వీట్ చేశారు. అదేవిధంగా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ బీజేపీ నాయకులు విజేందర్ గుప్తా, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మరియు పలువురు సినీ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. వారందరికీ ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.1003
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles