ట్విట్టర్‌కు వికీపీడియా బర్త్‌డే మెసేజ్.. సోషల్ మీడియాలో వైరల్

Sat,March 23, 2019 03:25 PM

Wikipedia Tweets Birthday Message To Twitter reply from twitter is hilarious

మొన్న మార్చి 21న ట్విట్టర్ పుట్టి 13 ఏళ్లు అయింది. ఈసందర్భంగా వికీపీడియా ట్విట్టర్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు చెప్పింది. తమ ట్విట్టర్ ఖాతాలో ట్విట్టర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వికీపీడియా.. ట్విట్టర్ పుట్టినరోజు సందర్బంగా ట్విట్టర్ గురించి మరింత సమాచారం తెలుసుకోండి అంటూ ట్విట్టర్ వికీ లింక్‌ను షేర్ చేసింది. 499 రోజుల నుంచి ట్విట్టర్‌లో 140 క్యారెక్టర్ల కంటే ఎక్కువ ట్వీట్ చేయగలుగుతున్నామని ఇలా ట్విట్టర్ గురించి చెబుతూ ట్వీట్లు చేసింది వికీపీడియా.

మాలాంటి పాతకాలం నాటి మనుషుల దగ్గర మీరు సలహాలు తీసుకుంటారా? అలా అయితే మేం మీకు వికీపీడియాలో ఉండే ఎడిట్ బటన్ రహస్యాన్ని చెబుతాం.. అంటూ ఫన్నీగా వికీపీడియా ట్వీట్ చేసింది. ట్విట్టర్‌లో ఎడిట్ ఆప్షన్ ఉండదు కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని వికీపీడియా ఆ ట్వీట్ చేసిందన్నమాట. వీటన్నింటికీ ట్విట్టర్ ఒకే ఒక రిప్లయి ఇచ్చింది. మీకు మేం తెలిసినందుకు సంతోషిస్తున్నాం.. అంటూ ట్విట్టర్ ఓ రిప్లయి ఇచ్చింది. ట్విట్టర్, వికీపీడియా మధ్య ఆసక్తికర సంభాషణ జరుగుతుంటే నెటిజన్లు ఊరుకుంటారా? వాళ్లకు నచ్చిన కామెంట్లు చేస్తూ ఆ ట్వీట్లను వైరల్ చేస్తున్నారు.

1299
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles