కారులోంచి లాగి యువతిపై అత్యాచారం

Tue,February 12, 2019 07:28 AM

లూథియానా: పంజాబ్‌లోని లూథియానా జిల్లా ఇస్సివాల్ గ్రామ సమీపంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కారులో వెళ్తున్న యువతి(21)ని పది మంది వ్యక్తులు అడ్డగించి బలవంతంగా కారులోంచి లాగి అత్యాచారం చేశారు. మరో వ్యక్తితో కలిసి మహిళ శనివారం నాడు కారులో ప్రయాణిస్తుంది. వారిని అనుసరించి మూడు బైక్‌లపై వచ్చిన వ్యక్తులు కారును అడ్డగించి ఆపారు. వెనువెంటనే రాళ్లు, ఇటుకలతో కారుపై దాడి చేశారు. అనంతరం యువతిని కారులోంచి లాగి బలవంతంగా ప్రక్కకు తీసుకువెళ్లారు. అక్కడ మరో ఏడుగురు వ్యక్తులకు ఫోన్ చేసి పిలిపించారు. అందరూ కలిసి మహిళపై అత్యాచారం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ తరుణ్ రతన్ తెలిపారు.

1792
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles