పాముకాటు.. ఆస్పత్రిలో మంత్రాలు..

Wed,July 17, 2019 12:43 PM

భోపాల్‌ : పాముకాటుతో బాధపడుతున్న ఓ 25 ఏళ్ల మహిళకు వైద్యులు చికిత్స అందిస్తున్న క్రమంలో బాధితురాలికి ఆమె కుటుంబ సభ్యులు తాంత్రికుడితో మంత్రాలు చేయించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌ జిల్లాలో ఆదివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఇమాత్రి దేవి అనే మహిళకు ఆదివారం రాత్రి పాము కరిచింది. దీంతో ఆమెను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. విశ్రాంతి తీసుకుంటున్న ఆ మహిళకు.. ఆమె కుటుంబ సభ్యులు తాంత్రికుడిని పిలిపించి.. ఆస్పత్రి వార్డులోనే మంత్రాలు చేయించారు. ఈ తతంగాన్ని విధుల్లో ఉన్న నర్సు చూసింది. కానీ విధి నిర్వహణలో ఉన్న డాక్టర్‌కు, సెక్యూరిటీ గార్డుకు చెప్పలేదు. అయితే తాంత్రికుడు మంత్రాలు చేస్తున్న సమయంలో కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారు. దీంతో ఈ ఘటన వెలుగు చూసింది. తాంత్రికుడి మంత్రాలు చూసి కూడా డాక్టర్‌కు చెప్పని నర్సుకు వైద్య ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

830
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles