నారాసుర పాలనలో మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు!

Sat,May 25, 2019 03:36 PM

YCP MP Vijay Sai Reddy Comments On Chandrababu Naidu

అమ‌రావ‌తి: వైఎస్ఆర్‌సీపీ శాసనసభా పక్షం నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి వైసీపీ ఎంపీ విజ‌య సాయిరెడ్డి హృదయపూర్వక శుభాభినందనలు తెలిపారు. మీ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ.. ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపే శక్తిని మీకు ప్రసాదించాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాన‌ని ట్విట‌ర్‌లో ఆకాంక్షించారు.


విజ‌య సాయిరెడ్డి ట్విట‌ర్‌లో స్పందిస్తూ.. వైఎస్‌ జగన్‌ పాలనలో ఉజ్వల ఆంధ్రప్రదేశ్ కల సాకారమవుతుంది. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతాయి. అన్ని వర్గాల ప్రజలకు భవిష్యత్తుపై పూర్తి భరోసా కల్పిస్తూ రైతన్నల కష్టాలకు కాలం చెల్లే రోజులు వచ్చాయి. నవరత్నాలతో ప్రతి పేదింటి గడప అభివృద్ధికి ఒక ప్రయోగశాలగా మారబోతోంది. ప్రజల దీవెనతో సాధించిన ఈ ఘన విజయంతో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల బాధ్యత మ‌రింత‌ పెరిగింది. ఐదేళ్ల నారాసుర పాలనలో మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అందులో నుంచి పుట్టిన కసిని జగనన్నను మరింత బలోపేతం చేయడానికి ఉపయోగించాలి. మాటకు మాట, ప్రతీకారాలు మనకు, వాళ్లకు తేడా లేకుండా చేస్తాయి. అని పేర్కొన్నారు.

3930
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles