ఇంత ఆవేశం మంచిది కాదు బాబూ..!

Sun,September 29, 2019 03:15 PM

అమరావతి: 350 ఎలక్ట్రిక్ బస్సుల టెండర్లపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కడుపు మంట స్టార్ట్ అయిందని వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి అన్నారు. ట్విటర్లో చంద్రబాబుపై ఆయన ఇవాళ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'బస్సుల టెండర్లపై 9 సంస్థలు ముందు కొచ్చాయని ఆర్టీసి చెప్పింది. అక్టోబరు 14న టెక్నికల్, నవంబరు 1న ఫైనాన్షియల్ బిడ్స్ వేయాల్సి ఉంది. అప్పుడే 7500 కోట్ల క్విడ్ ప్రో కో జరిగిందని కల వచ్చిందట. ఇంత ఆవేశం మంచిది కాదు బాబూ. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటి నుంచి పచ్చ దండుకు కంటిమీద కునుకు లేదు. సంస్థను దివాలా తీయించి జీతాలు చెల్లించలేని దుస్థితికి నెట్టిన వారు ఉచిత సలహాలిస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల లీజు ప్రక్రియ పైన, ఆర్టీసీని ప్రైవేటీకరిస్తారని ఏడుపుగొట్టు తనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎంతగా దిగజారి పోయారు చంద్రబాబు గారు. వలంటీర్ల పేరు వింటేనే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. మీ పుత్రరత్నం విదేశీ అమ్మాయిలతో తాగి తందనాలాడిన ఫోటోలను ప్రజలంతా చూశారు. అతడినేమో దొడ్డిదారిన ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కట్టబెట్టారు. మంది పిల్లలపై నిందలు వేస్తారా?' అని విజయ సాయిరెడ్డి ఘాటుగా స్పందించారు.

1781
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles