దొంగ ఏడుపులు వద్దు.. సీఎంకు ఏం చేయాలో తెలుసు..!

Tue,June 4, 2019 01:12 PM

YCP Vijay Sai Reddy Satire tweets on Chandrababu

అమ‌రావ‌తి: కియా కార్ల కంపెనీ ఏర్పాటులో జరిగిన భూ కుంభకోణం పుట్ట త్వరలోనే పగులుతుందని వైఎస్సార్‌సీపీ నేత‌, ఎంపీ విజయ సాయి రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న‌ ట్విటర్‌ వేదికగా చంద్రబాబు ప్రభుత్వంలో జ‌రిగిన అవినీతి, నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌, అవ‌క‌త‌వ‌క‌ల‌పై ధ్వజమెత్తారు.

విజ‌య‌సాయిరెడ్డి ఏమ‌న్నారంటే.. కియా కార్ల కంపెనీతో ఇంటికో ఉద్యోగం వస్తుందని ఊదరగొట్టిన కుల మీడియా ఇప్పుడు కొత్త రాగం అందుకుంది. అక్కడ అంతా తమిళులే అని, ప్రాజెక్టు అభివృద్ధి జరగలేదని ఏడుపు లంకించుకున్నాయి. దొంగ ఏడుపులు వద్దు. యువ సీఎంకు ఏం చేయాలో తెలుసు. కియా పేరిట జరిగిన భూ కుంభకోణం పుట్ట త్వరలోనే పగులుతుంది. ఆశా సిస్టర్ల వేతనాన్ని రూ.3 వేల నుంచి ఒకే సారి 10 వేలకు పెంచి వైఎస్ జగన్ మోహ‌న్‌రెడ్డి 50 వేల కుటుంబాల్లో వెలుగులు నింపారు. అక్రిడేటేడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్టు(ఆశా) సోదరీమణులపై చంద్రబాబు ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించింది. అరెస్టులు చేసి హింసలు పెట్టారని ఆరోపించారు.


ఆఫీసుల అద్దె చెల్లింపుల్లో చంద్రబాబు ప్రభుత్వం వందల కోట్ల అవినీతికి పాల్పడింది. నక్కల రోడ్డులోని పంచాయతీ రాజ్. గ్రామీణాభివృద్ధి శాఖ ఆఫీసుకు ఐదు లక్షల లోపే అద్దె చెల్లించేవారు. దాన్ని రూ.30 లక్షల అద్దె బిల్డింగులోకి షిఫ్ట్‌ చేశారు. ప్రజల సొమ్ము అంటే ఇంత చులకనా బాబూ? రాష్ట్రాన్ని విడగొట్టి కట్టుబట్టలతో తరిమారని ఏడ్చి పెడబొబ్బలు పెట్టిన వ్యక్తి దుబారా ఖర్చులు చూడండి. ఉన్నత విద్యామండలిలో నలుగురి డ్రైఫూట్స్ ఖర్చు18 లక్షలంట. విజనరీ, అనువజ్ణుడు, అభివృద్ధి పదగామి అని కుల మీడియా కీర్తించింది ఈయననే. అని మండిప‌డ్డారు

8228
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles