లగ్జరీ కారు.. కరువు ప్రాంతాలు.. యడ్యూరప్ప టూర్

Sat,April 16, 2016 11:44 AM

బెంగుళూరు : ఉత్తర కర్నాటకలో నీటి కరువు తీవ్రంగా ఉంది. ఆ ప్రాంతాల్లో ఆ రాష్ట్ర మాజీ సీఎం యడ్యూరప్ప పర్యటిస్తున్నారు. అది కూడా ఓ లగ్జరీ కారులో. నీళ్ల కుండలను పక్కన పెట్టేసి మరీ స్థానికులు ఆ ప్రడో కారునే చూస్తూ ఉండిపోతున్నారు. అయితే టయోటా ల్యాండ్ క్రూజర్ కారులో యడ్యూరప్ప కరువు ప్రాంతాల్లో పర్యటించడం పట్ల విమర్శలు తలెత్తుతున్నాయి. ఆ లగ్జరీ ప్రడో కారును మాజీ ఎమ్మెల్యే మురుగేశ్ నిరానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్పకు ప్రజెంట్ చేశారు. రాష్ట్రంలో పర్యటించేందుకు లగ్జరీ కారు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నిరానీ ఆ కారును కానుకగా ఇచ్చినట్లు యడ్యూరప్ప తెలిపారు.

అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వ్యాపారవేత్త అయిన మురుగేశ్ నిరానీకి షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. లగ్జరీ కారును అతను కానుకగా ఇవ్వడం పెద్ద సమస్య కాదు. కానీ ఆ మాజీ ఎమ్మెల్యే చెరుకు రైతులకు బాకీ ఉన్నారు. ఆ రైతులకు ఇంకా డబ్బులు చెల్లించలేదు. దీన్నే కాంగ్రెస్ పార్టీ తప్పుగా భావిస్తోంది. ఇటీవల ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య ఖరీదైన వాచ్‌ను పెట్టుకున్నందుకు వివాదానికి గురయ్యారు. ఫ్రెండ్ గిఫ్ట్‌గా ఇచ్చిన హూబ్లట్ వాచ్‌ను సీఎం పెట్టుకున్నారు. దీనిపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేశాయి. ఈ దశలో బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప ఇలా కాస్ట్‌లీ కారులో టూర్లు వేయడం వివాదానికి తెరలేపింది.

2160
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles