కొలువుదీరిన కర్ణాటక మంత్రివర్గం

Tue,August 20, 2019 12:46 PM

Yediyurappa inducts 17 Ministers in first Cabinet expansion

బెంగళూరు : కర్ణాటకలో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. ముఖ్యమంత్రి యెడియూరప్ప కేబినెట్‌లో 17 మందికి చోటు దక్కింది. ఈ 17 మంది చేత ఆ రాష్ట్ర గవర్నర్‌ వాజుభాయి వాలా ప్రమాణస్వీకారం చేయించారు. 17 మందిలో ఒకరు మహిళ ఉన్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి యెడియూరప్ప, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీ నాయకులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో జగదీష్‌ షెట్టర్‌, కేఎస్‌ ఈశ్వరప్ప, ఆర్‌. అశోక, హెచ్‌ నగేశ్‌(స్వతంత్ర ఎమ్మెల్యే), లక్ష్మణ్‌ సంగప్ప సవాడీ, కోట శ్రీనివాస్‌ పూజారి, గోవింద్‌ ఎం కరజోల్‌, అశ్వత్‌ నారాయణ్‌ సీఎన్‌, బీ. శ్రీరాములు, ఎస్‌. సురేశ్‌ కుమార్‌, వీ. సోమన్న, సీటీ రవి, బసవరాజు బొమ్మై, జేసీ మధు స్వామి, సీసీ పాటిల్‌, ప్రభు చౌహాన్‌, శశికళ జోల్లె అన్నాసాహెబ్‌ ఉన్నారు.

949
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles