పెళ్లిల్లు ర‌ద్దు చేసుకోండి.. ఆదేశించిన ప్ర‌భుత్వం

Sat,December 1, 2018 01:10 PM

Yogi government banned all weddings in Prayagraj between January and March next year

ల‌క్నో: వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుంచి మార్చి వ‌ర‌కు జ‌రిగే పెళ్లిళ్ల‌ను ర‌ద్దు చేసుకోవాల‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌యాగ్‌రాజ్ సిటీలో ఈ మూడు నెల‌ల పాటు వివాహ వేడుక‌లు ఉండ‌వు. వ‌చ్చే ఏడాది ఆరంభం నుంచి కుంభ‌మేళ‌లో జ‌ర‌గ‌నున్న‌ది. అయితే ఆ మూడు నెల‌ల కాలంలో ప్ర‌యాగ్‌రాజ్‌(అల‌హాబాద్‌)లో ఎటువంటి పెళ్లి వేడుక‌లు పెట్టుకోరాదు అని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశించింది. ఒక‌వేళ ఇప్ప‌టికే తేదీల‌ను, మ్యారేజ్ హాళ్ల‌ను ఫిక్స్ చేసుకున్న‌వారు వాటిని ర‌ద్దు చేసుకోవాల‌ని కూడా ఆదేశాలు వ‌చ్చాయి. దీంతో ఇప్ప‌టికే ఫంక్ష‌న్ హాళ్ల‌ను బుక్ చేసుకున్న వాళ్లు మ‌రో చోటు వేడుక‌ను నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొంద‌రైతే ఈ సీజ‌న్‌లో పెళ్లి తేదీల‌ను ర‌ద్దు చేసుకుంటున్నారు. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో వెడ్డింగ్ బిజినెస్ కూడా దెబ్బ‌తినే అవ‌కాశాలు ఉన్నాయి. కుంభ‌మేళా స‌మ‌యంలో ప‌విత్ర స్నానాలు ఆచ‌రించే దినాలు పూర్తిగా ముగిసే వ‌ర‌కు ప్ర‌యాగ్‌రాజ్‌లో ఎటువంటి పెళ్లి వేడుక‌లు నిర్వ‌హించ‌రాదు అని ఆదేశాల్లో స్ప‌ష్టంగా పేర్కొన్న‌ది. జ‌న‌వ‌రిలో మ‌క‌ర సంక్రాంతి, పౌష్ పూర్ణిమ రోజుల్లో, ఫిబ్ర‌వ‌రిలో మౌని అమావాస్య‌, బసంత్ పంచ‌మి, మాగి పూర్ణిమ రోజుల్లో, మార్చిలో మ‌హాశివ‌రాత్రి పూట జ‌రిగే స్నానాల స‌మ‌యంలో భారీ ఎత్తున జ‌నం వ‌స్తార‌ని, కాబ‌ట్టి ఆ రోజుల్లో ఇటువంటి వేడుక‌లు పెట్టుకోరాదు అని ఆదేశించారు.

7166
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles