యోగి ఆదిత్యనాథ్ పేర్లమార్పిడిపై మేమ్‌ల పరంపర

Fri,October 19, 2018 06:16 PM

yogi inspired name change memes

యూపీ సీఎం యోగి ఆద్యినాథ్ పేర్లమార్పు అంటే పడిచస్తారు. ఇస్లాంపూర్‌ను ఈశ్వర్‌పూర్ అని, హుమాయూన్‌నగర్‌ను హనుమాన నగర్ అని ఎడాపెడా మార్చేస్తుంటారు. ఇటీవలే ఆయన కొంచెం పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు. అలహాబాద్ పేరును ప్రయాగరాజ్ అని మార్చేందుకు నడుంబిగించారు. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మార్చడం సరైనదే అంటుంటే మరికొందరు ఈ ధోరణి దేశానికి మంచిది కాదని విసుక్కుంటున్నారు. కొందరు మేమ్‌లతో యోగిపై విసుర్లు వేస్తున్నారు. -ఆజ్‌సే తుమ్హారా నామా పేరుతో ఈ మేమ్‌లు కుప్పతెప్పలుగా వస్తున్నాయి. న్నిటిలో ఒకటే ైస్టెల్. దేశవిదేశీ ప్రముఖులు యోగికి ఫోన్ చేయగానే ఆయన వారి పేరు మార్చినట్టు చెప్తుంటారు. ఉదాహరణకు కొన్ని..
-అమీర్‌ఖాన్.. అమర్ ఖన్నా
-పుతిన్.. పునీత్
-క్రిస్ గేల్.. కృష్ణా గోయల్
-మైకేల్ జాక్సన్.. మాయ్‌కాలాల్ జైకిషన్
-ఎమ్మా వాట్సన్.. అమ్మా వత్సల్
-జానీ సిన్స్.. జనార్ధన్ సింఘానియా
-ఓవైసీ.. అవస్థీ
-బాటిస్టా.. బాదంపిస్తా
-హ్యారీ పాటర్.. హరీ పుత్తర్
-జస్టిన్ బీబర్.. జతిన్ బీర్బల్
-జాక్వెలిన్ పెర్నాండెజ్.. జానకీదేవి
-ఒబామా.. సుధామా
-కత్రినా కైఫ్.. క్రాంతిదేవి

ఇక రజనీకాంత్ అభిమాని ఒకరు యోగి పేరునే విన్ డీజెల్‌గా మార్చినట్టు మేమ్ పెట్టారు. మరి రజనియా మజాకా?

5621
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles