దిగ్విజయ్ సింగ్‌కు షాకిచ్చిన యువకుడు..వీడియో

Mon,April 22, 2019 06:34 PM

Youth Gives a Shocking answer to Digvijay singh vedio goes viral


మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్ మాజీ సీఎం, భోపాల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ కు ఛేదు అనుభవం ఎదురైంది. దిగ్విజయ్ సింగ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భోపాల్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సభకు యువతీయువకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సభలో దిగ్విజయ్ మాట్లాడుతూ..మోదీ వేస్తానన్న రూ.15 లక్షలు మీ ఖాతాలో జమ అయ్యాయా..? అని ప్రశ్నించారు. ఇంతలోనే ఓ యువకుడు సమాధానం చెప్పేందుకు స్టేజీపైకి రాగా..దిగ్విజయ్ అతనికి మైక్ ఇచ్చారు. మోదీ సర్జికల్ దాడులు చేపట్టారు..ఉగ్రవాదులను చంపేశారని..మోదీకి మద్దతు ఇస్తూ ఆ యువకుడు సమాధానమిచ్చాడు. దిగ్విజయ్ సింగ్ తనకు ప్రతికూలంగా సమాధానం రావడంతో ఒక్కసారిగా షాకయ్యారు. దీంతో పక్కనే కాంగ్రెస్ నేత ఒకరు ఆ యువకుడిని స్టేజీ కిందకు పంపించేశాడు. యువకుడు తన జవాబుతో దిగ్విజయ్ సింగ్‌ను కంగు తినిపించిన వీడియో వైరల్ అవుతోంది.2715
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles