బాలీవుడ్ సాంగ్స్ రాప్ సాంగ్స్‌గా మారితే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడండి

Sat,March 30, 2019 04:47 PM

YouTuber Lilly Singh Re imagines Bollywood Hits As Rap Songs

యూట్యూబర్ లిల్లీ సింగ్ తెలుసు కదా. అలా అంటే మీకు తెలియకపోవచ్చు కానీ సూపర్ ఉమెన్ అంటే గుర్తుకొచ్చి ఉంటుంది చూడండి. సూపర్ ఉమెన్ యూట్యూబ్ చానెల్‌ను స్టార్ట్ చేసిన లిల్లీ సింగ్.. తన యూట్యూబ్ చానెల్‌లో ఫన్నీ వీడియోలు చేస్తుంది. కొత్త కొత్త వీడియోలను చేస్తూ నెటిజన్లను అలరిస్తుంటుంది. తనకు యూట్యూబ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. 14 మిలియన్ సబ్‌స్ర్కైబర్స్ ఉన్నారు తనకు.

రీసెంట్‌గా ఓ వీడియోను రిలీజ్ చేసిన లిల్లీ సింగ్.. బాలీవుడ్ సాంగ్స్‌ను రాప్ సాంగ్స్‌గా మార్చింది. ఈమధ్య రాప్ మ్యూజిక్ బాగా పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. దీంతో చోలీ కే పీచే క్యా హై, ఆల్ ఈజ్ వెల్, ఆంక్ మేరీ.. బాలీవుడ్ సాంగ్స్‌ను రాప్ సాంగ్స్‌గా మార్చింది. ఆ వీడియోను తన యూట్యూబ్ చానెల్‌లో పోస్ట్ చేసింది.

నాకు బాలీవుడ్ సాంగ్స్ అంటే ఇష్టం. రాప్ మ్యూజిక్ అన్నా ఇష్టమే. అందుకే.. బాలీవుడ్‌లోని నా ఫేవరేట్ సాంగ్స్‌ను రాప్ సాంగ్స్‌గా మార్చి ఈ వీడియో చేశా.. అంటూ ఈ వీడియోను రిలీజ్ చేసింది లిల్లీ సింగ్. త‌న ట్విట్ట‌ర్ ఖాతాలోనూ ఆ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోను మెచ్చిన నెటిజన్లు ట్విట్టర్‌లో తనకు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
1630
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles