మనిషి చనిపోతే పరవశించి పోయే నాయకుడు లోకేష్..!

Tue,March 19, 2019 02:48 PM

YSRCP MLA Alla Ramakrishna Reddy Fires on Chandrababu Naidu

విజయవాడ: మంగళగిరిలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతోందని.. ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా సర్వేలు చేస్తున్నారు. సర్వేలు చేస్తున్న వారిని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పాం. త్వరలో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తాం. చంద్రబాబు అక్రమ మార్గంలో గెలవాలని చూస్తున్నారు. సెల్‌ఫోన్లు, బైకులు పంచుతున్నారు.

మంగళగిరికి చేసిందేంటో చంద్రబాబు, లోకేష్‌లు చెప్పాలి. లోకేష్ కాదు.. మంగళగిరిలో చంద్రబాబు పోటీ చేయాలి. మనిషి చనిపోతే పరవశించి పోయే నాయకుడు లోకేష్ ఒక్కడే. పోలీసులు పారదర్శకంగా ఉండాలి. హైదరాబాద్‌లో పార్క్‌ను డీజీపీ ఆక్రమిస్తే కోర్టుకు వెళ్లామని కక్ష కట్టారు. భూములు కాజేసేందుకే మంగళగిరికి లోకేష్ వచ్చారు. ఎమ్మెల్సీ పదవికి లోకేష్ ఎందుకు రాజీనామా చేయలేదు. నిమ్మకూరు దత్తత తీసుకున్న లోకేష్ అక్కడేం చేయలేదు. మంగళగిరిలో లోకేష్ ఏం అభివృద్ధి చేస్తారు. సదావర్తి భూములు మింగాలని చూసిన మీరు ఇక్కడ రియల్ ఎస్టేట్ చేయాలని చూస్తున్నారని ఆళ్ల మండిపడ్డారు.

3132
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles