కోడెల అవినీతి బాగోతంపై సంచ‌ల‌న‌ ట్వీట్

Wed,June 5, 2019 01:01 PM

ysrcp MP Vijaya Sai Reddy Controversial Comments on Kodela Siva Prasad

అమ‌రావ‌తి: పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించిన పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డికి ఆ పార్టీ ఎంపీ విజయ సాయి రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ లోక్‌సభ పక్ష నేతగా నియమితులైన పి.మిథున్‌ రెడ్డి, చీఫ్‌ విప్‌గా నియమితులైన మార్గని భరత్‌ రామ్‌కు ఆయన ట్విట‌ర్ వేదిక‌గా శుభాకాంక్షలు తెలిపారు. స్పీక‌ర్ ప‌ద‌వికి టీడీపీ నేత‌, మాజీ స్పీక‌ర్ కోడెల శివ ప్ర‌సాద్‌రావు క‌ళంకం తెచ్చార‌ని ధ్వ‌జమెత్తారు. కోడెల ప్ర‌జాధ‌నం దుర్వినియోగంపై ట్విట్టర్‌లో విజయ సాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు.

ప్రజాధనం దోపిడీలో జులుం ప్రదర్శించి కోడెల స్పీకర్ పదవికే కళంకం తెచ్చారు. ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల హెల్త్ స్కీం, ఫార్మసీ కౌన్సిల్ ఆఫీసులను కనీస వసతులు కూడా లేని తన సొంత భవనంలో పెట్టించారు. చ.అడుగుకు రూ.16 అద్దె... పైరవీ చేసుకుని రూ.25 తీసుకున్నారు. మొత్తం నాలుగున్నర కోట్ల పైనే లూటీ చేశారని ఆరోపించారు.4325
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles