సమీక్షలేమిటి బాబూ? కుర్చీని వదలనని మొరాయించేట్టున్నారు..

Fri,April 19, 2019 03:07 PM

YSRCP MP Vijayasai reddy fire on Chandrababu comments

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా.. అధికారులు, మంత్రులతో సమీక్షలేమిటి చంద్రబాబూ? అని విజయసాయి రెడ్డి ట్విట్టర్‌లో ప్రశ్నించారు. అపద్ధర్మ సీఎంగా ఇంకో 35 రోజులు కృష్ణా, రామా అనుకుంటూ కాలం వెళ్లదీయాలి తప్ప అధికారిక వ్యవహారాలతో మీకేం పని? అని అడిగారు. మీ వాలకం చూస్తుంటే రేపు కౌంటింగ్‌ తర్వాత కూడా కుర్చీని వదలనని మొరాయించేట్టున్నారు కదా అని విజయసాయి రెడ్డి ఎద్దెవా చేశారు.





3294
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles