పచ్చ దొంగలకు అమరావతి తప్ప ఇంకేది పట్టదు!

Tue,September 10, 2019 06:31 PM

అమరావతి: టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్విటర్ వేదికగా చంద్రబాబు ఐదేళ్ల పాలనలో జరిగిన దోపిడీపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. '' పచ్చ దొంగలకు అమరావతి తప్ప ఇంకేది పట్టదు. లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ రాబడుల గురించే ధ్యాసంతా. అందుకే ఏదో ఒక కృత్రిమ సమస్యను సృష్టించి అనుకూల మీడియాతో అలజడి లేపాలని చూస్తున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి మీరు చేసిందే అదే కదా. మీ పాలనలో వ్యవస్థలన్నిటినీ నిర్వీర్వం చేసి పోలీసులకు పచ్చ యూనిఫాం తొడిగించారు. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ దర్యాప్తు కోసం డిమాండు చేశారు. ఇప్పుడు పోలీసులు స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. డౌట్‌ ఉంటే శాంపిల్‌గా కోడెల కుటుంబం కేసులను సీబీఐకి అప్పగించమని అడగొచ్చు చంద్రబాబు గారూ'' అని విజయ సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

1277
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles