ఐవోసీఎల్‌లో లా ఆఫీసర్లు


Tue,March 19, 2019 01:27 AM

iocl
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో క్లాట్-2019 ద్వారా లా ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


- పోస్టులు: లా ఆఫీసర్ (గ్రేడ్ ఏ/గ్రేడ్ బీ)


అర్హతలు:
- గ్రేడ్ బీ లా ఆఫీసర్: కనీసం 60 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ/ఐదేండ్ల లా డిగ్రీతోపాటు ఐదేండ్ల అనుభవం.
- జీతం: ఏడాదికి సుమారుగా రూ. 21 లక్షలు వస్తుంది.
- గ్రేడ్ ఏ లా ఆఫీసర్ - ఎల్‌ఎల్‌బీ/ఐదేండ్ల ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణులు. కనీసం రెండేండ్ల వృత్తి అనుభవం ఉండాలి.
- వయస్సు: జూన్ 30 నాటికి 30 ఏండ్లు మించరాదు. రిజర్వ్‌డ్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- జీతం: ప్రారంభ వేతనం నెలకు రూ.60 వేలు+ ఇతర అలవెన్స్‌లు ఉంటాయి. (ఏడాదికి సుమారుగా 17 లక్షల వరకు వస్తాయి)
- ఎంపిక విధానం: ఎల్‌ఎల్‌ఎం కోసం నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) -2019లో వచ్చిన స్కోర్ ఆధారంగా దరఖాస్తు చేసుకున్నవారిని షార్ట్‌లిస్ట్ చేసి వ్యక్తిగత ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్/గ్రూప్ టాస్క్‌ల ద్వారా ఎంపిక చేస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- నోట్: అభ్యర్థులు మొదట క్లాట్ ఎల్‌ఎల్‌ఎం దరఖాస్తు చేసుకుని తర్వాతి అడ్మిట్‌కార్డు/హాల్‌టికెట్ నంబర్‌తో ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్‌లో పై పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
- పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: https://www.iocl.com

498
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles