కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామ్-2019


Fri,April 12, 2019 01:36 AM

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రతి ఏటా నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామ్-2019 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
upsc
-పోస్టు పేరు: మెడికల్ ఆఫీసర్
-మొత్తం పోస్టుల సంఖ్య: 965
విభాగాలవారీగా ఖాళీలు:
-అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ (రైల్వేస్)-300 ఖాళీలు
-అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ (ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ హెల్త్ సర్వీసెస్)-46 ఖాళీలు
-జూనియర్ స్కేల్ ఆఫీసర్ (సెంట్రల్ హెల్త్ సర్వీసెస్)-250 ఖాళీలు
-జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్)- 7 ఖాళీలు
-జనరల్ డ్యూటీ గ్రేడ్-2 మెడికల్ ఆఫీసర్ (న్యూఢిల్లీలోని ఈస్ట్/నార్త్/సౌత్ మున్సిపల్ కార్పొరేషన్‌లలో)- 362 ఖాళీలు
-అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు ఇంటర్న్‌షిప్‌ను పూర్తిచేసి ఉండాలి. ఫైనల్ ఇయర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సీఎంఎస్‌ఈ పరీక్ష ఫలితాలు విడుదల (సెప్టెంబర్/అక్టోబర్-2019) నాటికి ఎంబీబీఎస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
-వయస్సు: 2019 ఆగస్టు 1 నాటికి 32 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లవరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 56,100- 1,77,500/- (పోస్టులను బట్టి పే స్కేల్ వేర్వేరుగా ఉన్నాయి)
-అప్లికేషన్ ఫీజు: రూ. 200/- (ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు)
-ఎంపిక: రెండు దశల్లో జరుగుతుంది. పార్ట్1లో రాతపరీక్ష, పార్ట్2లో ఇంటర్వ్యూ ఉంటుంది.
-పార్ట్1లో రాతపరీక్షలో భాగంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (సీబీఈ) నిర్వహిస్తారు.
-ఈ సీబీఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 500 మార్కులకు ఉంటుంది. దీనిలో పేపర్ I-250 మార్కులు, పేపర్ II -250 మార్కులు
-ఈ పరీక్షలో ప్రతితప్పు సమాధానానికి 1/3 మార్కులను తగ్గిస్తారు.
-పార్ట్2లో భాగంగా పర్సనాలిటీ టెస్ట్/ ఇంటర్వ్యూ-100 మార్కులకు ఉంటుంది.
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, వైజాగ్, బెంగళూరు, చెన్నైతోసహా దేశవ్యాప్తంగా 41 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 6
-సీఎంఎస్‌ఈ పరీక్షతేదీ: జూలై 21
-వెబ్‌సైట్: www.upsconline.nic.in

522
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles