ఆర్‌ఐఈ సీఈఈ-2019


Thu,April 18, 2019 02:33 AM

దేశవ్యాప్తంగా ఉన్న రీజినల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్‌ఐఈ)లలో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (సీఈఈ) ప్రకటనను ఎన్‌సీఈఆర్‌టీ విడుదల చేసింది.
rie-cee
-కోర్సులు: బీఎస్సీ బీఈడీ (నాలుగేండ్లు), బీఏ బీఈడీ (నాలుగేండ్లు), ఎమ్మెస్సీ ఎడ్యుకేషన్ (ఆరేండ్లు), బీఈడీ (రెండేండ్లు), ఎంఈడీ (రెండేండ్లు), బీఈడీ- ఎంఈడీ (మూడేండ్లు).
-అర్హతలు: డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం సంబంధిత సబ్జెక్టుతో ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు 45 శాతం మార్కులు వస్తే సరిపోతుంది.
-బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ/పీజీ ఉత్తీర్ణత. ఎంఈడీ కోర్సుకు కనీసం 50 శాతం మార్కులతో బీఈడీ, బీఏ బీఈడీ/బీఎస్సీ బీఈడీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-బీఈడీ-ఎంఈడీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత.
-ఎంపిక విధానం: కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (సీఈఈ) ద్వారా
-సీఈఈ: మొత్తం 80 ప్రశ్నలు. వీటిలో లాంగ్వేజ్‌కు సంబంధించి 20, టీచింగ్ ఆప్టిట్యూడ్-30, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు.
-ఇంటర్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తారు.
-పరీక్ష కాలవ్యవధి 90 నిమిషాలు.
కోర్సులను అందిస్తున్న సంస్థలు:
-ఆర్‌ఐఈ- భోపాల్, అజ్మీర్, భువనేశ్వర్, భోపాల్, మైసూర్, షిల్లాంగ్. ఎన్‌ఐఈ- న్యూఢిల్లీ, సీఐఈటీ-న్యూఢిల్లీతోపాటు పీఎస్‌ఎస్‌సీ ఐవీఈ-భోపాల్.
-ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ. 800/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.400/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 12
-అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడింగ్- మే 20 నుంచి జూన్ 8 వరకు
-ఫలితాల వెల్లడి: డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ - జూలై 10, బీఈడీ, ఎంఈడీ ఫలితాలు జూలై 20.
-వెబ్‌సైట్: www.cee.ncert.gov.in.

476
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles