ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్‌లు


Tue,May 14, 2019 12:38 AM

rfcl-students
న్యూఢిల్లీలోని నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన రామగుండం ఫర్టిలైజర్స్ & కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
- మొత్తం పోస్టులు: 79 (జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్-73, స్టోర్ అసిస్టెంట్-3, ఫార్మసిస్ట్-3)
- విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్ ల్యాబ్, స్టోర్, ఫార్మసి.
- జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్2)-73
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్, ఇండస్ట్రియల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ప్రాసెస్ కంట్రోల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్, అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & కంట్రోల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా లేదా బ్యాచిలర్ డిగ్రీ (కెమిస్ట్రీ) ఉత్తీర్ణత.
- స్టోర్ అసిస్టెంట్ (గ్రేడ్2)-3
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.

- ఫార్మసిస్ట్-3
- అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫార్మసీ విభాగంలో మూడేండ్ల డిప్లొమాతోపాటు ఏడాది అనుభవం ఉండాలి.
- వయస్సు: 2019 ఏప్రిల్ 30 నాటికి 18-30 ఏండ్ల మధ్య ఉండాలి.
- పేస్కేల్: రూ. 9000-16,400/-
- అప్లికేషన్ ఫీజు: రూ. 200/- ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్ మెన్‌లకు ఫీజు లేదు.
- పరీక్ష ద్రాలు: హైదరాబాద్, రామగుండం, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల.
- ఎంపిక: ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్
- దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 9
- వెబ్‌సైట్: www.nationalfertilizers.com

441
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles