నీతి ఆయోగ్‌లో ఖాళీలు


Wed,May 15, 2019 02:27 AM

students
న్యూఢిల్లీలోని నీతి ఆయోగ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

- మొత్తం ఖాళీలు: 82 (తాత్కాలిక ప్రాతిపదికన)
- మానిటరింగ్&ఎవల్యూషన్ లీడ్-10 ఖాళీలు
- అర్హత: సైన్స్/టెక్నాలజీ, కంప్యూటర్/అప్లికేషన్స్/ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, కామర్స్, మేనేజ్‌మెంట్, లా/కమ్యూనికేషన్ డెవలప్‌మెంట్, జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీ లేదా బీఈ/బీటెక్ లేదా సీఏ, సీఎస్/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో మూడేండ్ల అనుభవం ఉండాలి.
- యంగ్ ప్రొఫెషనల్స్-60 ఖాళీలు
- అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ లేదా బీఈ/బీటెక్, ఎంబీఏ లేదా మేనేజ్‌మెంట్‌లో రెండేండ్ల పీజీ డిప్లొమా లేదా ఎంబీబీఎస్/ఎల్‌ఎల్‌బీ/సీఏ లేదా ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
- ఇన్నోవేషన్ లీడ్-12 ఖాళీలు

- అర్హత: లా/కమ్యూనికేషన్ డెవలప్‌మెంట్, జర్నలిజం, సైన్స్/టెక్నాలజీ, కంప్యూటర్/అప్లికేషన్స్/ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, కామర్స్, మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీ లేదా బీఈ/బీటెక్ లేదా సీఏ, సీఎస్/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో పీహెచ్‌డీ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. సంబంధిత రంగంలో మూడేండ్ల అనుభవం ఉండాలి.
- వయస్సు: యంగ్ ప్రొఫెషనల్స్‌కు 32 ఏండ్లు, మిగతా పోస్టులకు 45 ఏండ్లకు మించరాదు.
- పేస్కేల్: యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులకు రూ. 60,000/-, మిగతా పోస్టులకు రూ. 80,000-1,45,000/-
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: మే 22
- వెబ్‌సైట్: www.niti.gov.in

383
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles