సముద్రమంత అవకాశాలు ఇండియన్ నేవీ!


Wed,May 15, 2019 02:12 AM

ప్రపంచంలో అతిపెద్ద నావికాదళాల్లో భారత నేవీ ఒకటి. రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేసే ఈ వ్యవస్థ దేశ తీరప్రాంతాన్ని క్షణక్షణం పహారా కాస్తూ శత్రువుల నుంచి దేశాన్ని రక్షిస్తుంది. లక్షలాదిమంది యువతీ,యువకులకు కేవలం ఉపాధి అవకాశాలనే కాకుండా దేశసేవ చేసుకునే భాగ్యాన్ని కల్పిస్తుంది. సవాళ్లను కోరుకునే యువతకు ఈ ఉద్యోగాలు చక్కటి అవకాశం. ప్రతిఏటా వేలాది ఉద్యోగాలను నేవీ భర్తీ చేస్తుంది. ప్రస్తుతం నేవీ, దాని అనుబంధ శాఖ అయిన కోస్ట్‌గార్డ్‌లో శాశ్వత, షార్ట్‌టర్మ్ తదితర ప్రకటనలు విడుదలైన నేపథ్యంలో నేవీలో అవకాశాలపై సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం....
NEVI

భారత నావికాదళం


ప్రపంచంలోని గొప్ప నావికాదళాల్లో భారత నావికాదళం ఒకటి. వెస్ట్రన్ (ముంబై), ఈస్ట్రన్ (విశాఖపట్నం), సదరన్ నేవల్ కమాండ్ (కొచ్చి)లతో దేశ తీరప్రాంత రక్షణను నావికాదళం చేపడుతుంది. దీనిలో పశ్చిమ కమాండ్ అరేబియన్ తీరప్రాంతాన్ని, తూర్పు కమాండ్ బంగాళాఖాతం తీరప్రాంత పహారా చేపడుతుండగా దక్షణ కమాండ్ శిక్షణ బాధ్యతలను చూస్తున్నాయి.

ఉద్యోగ అవకాశాలు


-ఆఫీసర్- ఎగ్జిక్యూటివ్, ఎలక్ట్రికల్, ఎడ్యుకేషన్, మెడికల్ విభాగాల్లో ఉద్యోగాలు ఉంటాయి.
-సెయిలర్-ఆర్టిఫైజర్, ఎస్‌ఎస్‌ఆర్, ఎంఆర్, మ్యుజీషియ న్స్, స్పోర్ట్స్ విభాగాల్లో అవకాశాలు ఉన్నాయి.
-నేవల్ సివిలియన్- దీనిలో ట్రేడ్స్‌మెట్, ఎంటీఎస్, గ్రూప్ బీ, సీ పోస్టులు ఉన్నాయి.
-మహిళలకు- ఏటీసీ, అబ్జర్వర్, లా, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, నేవల్ ఆర్కిటెక్చర్, పైలట్, నేవల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?


-పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్, లా, పీజీ (సైన్స్/ఆర్ట్స్), ఐటీఐ చేసినవారు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆఫీసర్లు (పీసీ & ఎస్‌ఎస్‌సీ)
-ఎగ్జిక్యూటివ్, టెక్నికల్, ఎడ్యుకేషన్ బ్రాంచీల్లో 121 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: పది, ఇంటర్, బీఈ, ఎంసీఏ.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. చివరితేదీ: మే 29.
-పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in

కోస్ట్‌గార్డ్‌లో- నావిక్ (డొమెస్టిక్ బ్రాంచీ (కుక్ &స్టీవార్డ్))-


-అర్హతలు- కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణత, 18- 22 ఏండ్ల మధ్య వయస్సు ఉండాలి.
-దరఖాస్తులు జూన్ 5 నుంచి ప్రారంభం, చివరితేదీ జూన్ 10.

టెక్నికల్ ఎంట్రీ స్కీం (10+2)


అర్హత: ఇంటర్(ఎంపీసీ) 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-వయస్సు:16 1/2 - 19 1/2 ఏండ్ల మధ్య ఉండాలి.
-మొత్తం ఖాళీలు-90
-దరఖాస్తు ఆన్‌లైన్‌లో. చివరితేదీ జూన్ 8

ఇండియన్ కోస్ట్‌గార్డ్- అసిస్టెంట్ కమాండెంట్లు


-అర్హత- ఇంటర్ ఎంపీసీ. ఇంటర్‌తో పైలట్ లైసెన్స్. డిగ్రీ, ఇంజినీరింగ్, లా చదివినవారు.
-చివరితేదీ: జూన్ 4

-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

492
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles