జేఈఈ అడ్వాన్స్‌డ్ -2018 సమ్మరీ


Mon,May 20, 2019 02:23 AM

ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన పరీక్షల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్ ఒకటి. ఈ ఏడాది మే 27న ఈ పరీక్ష జరుగనుంది. ఈ నేపథ్యంలో గతేడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు సంబంధించి పరీక్ష రాసినవారు, క్వాలిఫై అయినవారి సంఖ్య, ఆయా కేటగిరీల్లో ఐఐటీలకు అర్హత సాధించిన వారి వివరాలు సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం...
jee-advanced
-జేఈఈ అడ్వాన్స్‌డ్-2018: 2018లో జేఈఈ మెయిన్ రాసిన అభ్యర్థుల్లో టాప్ 2,24,000 మంది విద్యార్థులను షార్ట్‌లిస్ట్ చేసి అడ్వాన్స్‌డ్‌కు ఎంపికచేశారు. అయితే సమాన మార్కులు వచ్చిన అభ్యర్థులను సైతం ఎంపికచేయడంతో ఈ సంఖ్య 2,31,024కు పెరిగింది.
-గతేడాది దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 1,65,656. దీనిలో అర్హత సాధించినవారి సంఖ్య కేవలం 31,988 మాత్రమే.
-కంప్యూటర్ బేస్ట్ టెస్ట్: గతేడాది మొట్టమొదటిసారి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఆన్‌లైన్‌లో అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహించారు. మొదటిసారి సీబీటీ విధానంలో ప్రవేశపెట్టడంతో విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో కంప్యూటర్ సౌకర్యం కలిగించి మాక్‌టెస్ట్‌లు రాసుకునే అవకాశాన్ని కల్పించారు. దీనికి సంబంధించిన మాక్‌టెస్ట్‌లను, వీడియోలను అందుబాటులో ఉంచారు.
-గతేడాది అడ్వాన్స్‌డ్ రెండు పేపర్లలో Partial Mrking పద్ధతిలో 1/3 వంతు ప్రశ్నలను ఇచ్చారు. అదేవిధంగా న్యూమరికల్ ఆన్సర్ విధానాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టారు. మొత్తం 36 ప్రశ్నలు ఇవ్వగా వీటిలో 16 న్యూమరికల్ ఆన్సర్ ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సరైన జవాబు గుర్తించినవారికి ప్రతి సరైన జవాబుకు మూడు మార్కులు, లేనిచో సున్నా మార్కులు వేశారు.
-బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్: పేపర్-1, 2 ప్రారంభానికి ముందు అభ్యర్థులందరీ డిజిట్ ఫొటోగ్రాఫ్‌లను, ఫింగర్ ఇంప్రెషన్లను తీసుకున్నారు.
-ఆల్ ఇండియా ఫస్ట్‌ర్యాంక్: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2018లో 360 మార్కులకు గాను 337 మార్కులతో మొదటి ర్యాంకు సాధించాడు. ఈ విద్యార్థికి ఫిజిక్స్‌లో 117/120, కెమిస్ట్రీలో 114/120, మ్యాథ్స్‌లో 106/120 మార్కులు వచ్చాయి.
-ఏఏటీ 2018: ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ) -2018ను జూన్ 14న నిర్వహించారు. అదేవిధంగా అభ్యర్థుల సంఖ్యను పెంచడంతో తిరిగి 2018 జూన్ 17న ఏఏటీని రెండోసారి నిర్వహించారు. 1688 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 627 మంది పరీక్ష రాశారు. వీరిలో 620 మంది అర్హత సాధించారు.
-కామన్ ర్యాంకు మెరిట్ లిస్ట్ (సీఆర్‌ఎల్): ఎటువంటి రిలాక్సేషన్లు లేకుండా అర్హత సాధించిన అభ్యర్థులు 24,162.
-ఓబీసీ ఎన్‌సీఎల్ ర్యాంక్ లిస్టు: సీఆర్‌ఎల్ లేదా ఓబీసీ-ఎన్‌సీఎల్‌లో అర్హత సాధించినవారు 6908 మంది.
-ఎస్సీ ర్యాంక్ లిస్టు: ఎస్సీ కేటగిరీ లేదా సీఆర్‌ఎల్ లేదా ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ విధానంలో అర్హత సాధించినవారు 3018 మంది.
-ఎస్టీ ర్యాంకు లిస్టు: ఎస్టీ, సీఆర్‌ఎల్ లేదా ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీల్లో అర్హత సాధించిన వారు 917 మంది.
-పీడబ్ల్యూడీ ర్యాంకు లిస్టు (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ): మొత్తం 119 మంది. దీనిలో సీఆర్‌ఎల్-85, ఓబీసీ-ఎన్‌సీఎల్-26, ఎస్సీ-8 మంది విద్యార్థులు.
-ప్రిపరేటరీ ర్యాంక్ లిస్టు (ప్రిపరేటరీ విధానం)- 3445 మంది. దీనిలో జనరల్-పీడబ్ల్యూడీ-74, ఓబీసీ-ఎన్‌సీఎల్-38, ఎస్సీ (నాన్ పీడబ్ల్యూడీ)-2461, ఎస్సీ-పీడబ్ల్యూడీ-1, ఎస్టీ (నాన్ పీడబ్ల్యూడీ)-869, ఎస్టీ పీడబ్ల్యూడీ-2 ఉన్నారు.
jee-advanced2

lalith-kumar

392
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles