పదితోనే కేంద్ర కొలువు


Mon,May 20, 2019 12:31 AM

ఎంటీఎస్
యూపీఎస్సీ తరహాలోనే కేంద్ర ప్రభుత్వంలోని వివిధ స్థాయిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) కూడా ప్రతి ఏటా నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. ప్రస్తుతం కేవలం పదోతరగతి అర్హతతో ఎంటీఎస్ నోటిఫికేషన్‌ను ఎస్‌ఎస్‌సీ విడుదల చేసింది. సుమారు 10,000 పోస్టులకు టెన్త్‌తోపాటు ఇతర ఉన్నత విద్యార్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిని రాతపరీక్ష ద్వారానే భర్తీచేయనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్ష తీరుతెన్నులను పరిశీలిద్దాం.
SSC-STUDENTS

మల్టీటాస్కింగ్ స్టాఫ్ (నాన్ టెక్నికల్)

-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదోతరగతి/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-వయస్సు: 2019, ఆగస్టు 1 నాటికి 18-25 ఏండ్ల మధ్య ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అనుసరించి వయోపరిమితిలో ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లవరకు సడలింపు ఉంటుంది.
-పేస్కేల్: రూ.5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1800/-(7వ పే స్కేల్ ప్రకారం).
-అప్లికేషన్ ఫీజు: రూ.100/- (ఎస్సీ/ఎస్టీ/మహిళలు, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు ఫీజు లేదు).
-ఎంపిక: రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశ రాతపరీక్షలో పేపర్-1 (ఆబ్జెక్టివ్), రెండో దశ పేపర్-2 (డిస్క్రిప్టివ్) రాత పరీక్ష ద్వారా
-పేపర్-1 రాతపరీక్షలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలు ఇస్తారు. కేటాయించిన 90 నిమిషాల్లో పరీక్ష పూర్తిచేయాలి.
-జనరల్ ఇంగ్లిష్‌లోని ప్రశ్నలు మినహా మిగిలినవన్నీ ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఇస్తారు.
-పేపర్-2 రాతపరీక్ష కన్వెన్షనల్ పద్ధతిలో రాతపరీక్షను నిర్వహిస్తారు. దీనికి 50 మార్కులు కేటాయించారు.

SSC-STUDENTS2

స్కోరింగ్

-ఆన్‌లైన్ రాతపరీక్ష పేపర్ అందరికి ఒకేవిధంగా ఉండదు. కాబట్టి అభ్యర్థులకు వచ్చే మార్కులను ఈక్విపర్సంటైల్ మెథడ్ ద్వారా నార్మలైజేషన్ చేసి పరీక్షలో వచ్చిన స్కోర్ అలాట్ చేస్తారు.
-ఒకవేళ పేపర్-1లో ఎక్కువ మందికి ఒకే స్కోర్ వస్తే పేపర్-2 మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.

సిలబస్‌వారీగా ప్రిపరేషన్

-జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్: అభ్యర్థి నిర్ణయాత్మక శక్తిని అంచనా వేసేందుకు రీజనింగ్‌పై ప్రశ్నలు అడుగుతారు. మిగతా విభాగాల ప్రశ్నలతో పోలిస్తే రీజనింగ్‌కు సంబంధించిన ప్రశ్నలను గుర్తించేందుకు ఎక్కువ సమయం పడుతుంది. సబ్జెక్టును ప్రాథమిక భావనల నుంచి మొదలుపెట్టి, కఠినస్థాయి వరకు నేర్చుకుంటే తక్కువ సమయంలోనే సమాధానాన్ని గుర్తించవచ్చు. అందుకోసం షార్ట్‌కట్ మెథడ్స్‌ను నేర్చుకోవాలి. తార్కిక విశ్లేషణ, సునిశిత నైపుణ్యం, విమర్శనాత్మక దృక్కోణం వంటి లక్షణాలు ఉంటే రీజనింగ్‌లో త్వరగా సమాధానాలు గుర్తించవచ్చు. దీనిలో వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. సిమిలారిటీస్-డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసెస్, జడ్జ్‌మెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ, డిస్క్రిమినేటింగ్ అబ్జర్వేషన్, రిలేషన్‌షిప్, ఫిగర్ క్లాసిఫికేషన్, అర్థమెటికల్ నంబర్ సిరీస్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. తక్కువ సమయంలో సమాధానం గుర్తించాలంటే ఉన్న ఏకైక మార్గం ప్రాక్టీస్ ఒకటే. వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే సబ్జెక్టుపై పట్టు వస్తుంది.

ఇంగ్లిష్

-అభ్యర్థికి ఇంగ్లిష్ భాషా సామర్థ్యంపై అవగాహన ఉన్నదా? లేదా? అనే అంశాన్ని పరీక్షించడానికి దీనికి సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు. ఆంగ్ల భాషపై పరిజ్ఞానం, పదజాలం, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినానిమ్స్, ఆంటోనిమ్స్, పదాల వినియోగం, రీడింగ్ కాంప్రహెన్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, స్పెల్లింగ్స్, ఫ్రేజెస్/ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్, సెంటెన్స్ కరెక్షన్, ఎర్రర్ స్పాటింగ్ అంశాలపై ప్రశ్నలు వస్తాయి. వీటిలో పట్టు రావాలంటే ప్రామాణికమైన దినపత్రికలు/మ్యాగజైన్లు, ప్రామాణికమైన పుస్తకాలను సేకరించుకుని బాగా చదవాలి. నిత్యం కాంప్రహెన్షన్‌ను ప్రాక్టీస్ చేయడంవల్ల వేగంతోపాటు తేలికగా సమాధానాలను గుర్తించవచ్చు. ప్రతిరోజు ఇంగ్లిష్ వార్తలు/బులిటెన్‌లు వినాలి. గ్రామర్‌పై పట్టు రావడానికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఆర్టికల్స్, యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్‌లను చదవాలి.

న్యూమరికల్ ఆప్టిట్యూడ్

-అభ్యర్థుల్లో గణిత సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగమిది. ఇందులో చాలావరకు ప్రశ్నలు నేరుగా లేదా సూత్రాల ఆధారంగా ఉంటాయి. కాబట్టి గణిత సామర్థ్యం లేని విద్యార్థులు కూడా ప్రాథమిక భావనలపై పట్టు సాధిస్తే ఈ విభాగంలో మెరుగైన స్కోర్ సాదించవచ్చు. మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేసే సమయంలో ప్రశ్నలను షార్ట్‌కట్ మెథడ్స్ ఉపయోగించి సాధన చేయాలి. దీనివల్ల కచ్చితత్వం పెరుగుతుంది. గణితం మూలస్తంభాలైన కూడికలు, తీసివేతలు, గుణకాలు, భాగహారాలపై పట్టు సాధించాలి. 30 వరకు టేబుల్స్, 30 వరకు స్కేర్ రూట్స్, 20 వరకు క్యూబ్ రూట్స్ నేర్చుకోవాలి. దీనిలో నంబర్ సిస్టమ్స్, సంకీర్ణ సంఖ్యలు (వోల్ నంబర్స్), దశాంశాలు-భిన్నాలు, సంబంధాలు, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, శాతాలు, నిష్పత్తి-అనుపాతాలు, సరాసరి, వడ్డీ, లాభం-నష్టాలు, డిస్కౌంట్, టేబుల్స్-గ్రాఫ్‌లు, క్షేత్రమితి, కాలం-దూరం, కాలం-పని, సింప్లిఫికేషన్, వయస్సు తదితర అంశాలపై ప్రశ్నలు ఇస్తారు.
-జనరల్ అవేర్‌నెస్: జనరల్ అవేర్‌నెస్ విభాగాన్ని రెండు భాగాలుగా జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్‌గా విభజించవచ్చు. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ఎప్పటికపుడు మారుతున్న జాతీయ, అంతర్జాతీయ సంఘటనలు తెలుసుకోవాలి. ముఖ్యమైన విషయాలను దినపత్రికల్లో/మ్యాగజైన్‌లో వచ్చే వివరాలను తెలుసుకోవాలి. దీనివల్ల ఇంగ్లిష్ భాషపై కూడా పట్టు వస్తుంది.
-అభ్యర్థి సాధారణ అవగాహన సామర్థ్యం, అతని చుట్టూ ఉన్న పర్యావరణం, సమాజంపైగల అవగాహన తదితర అంశాలపై ప్రశ్నలు ఇస్తారు. దీనిలో ముఖ్యంగా ఇండియా, ఇరుగుపొరుగు దేశాలకు సంబంధించిన అంశాలు, క్రీడలు, హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, ఎకానమీ, జనరల్ పాలిటీ (భారత రాజ్యాంగం), శాస్త్రీయ పరిశోధనలపై ప్రశ్నలు అడుగుతారు.

పేపర్-2 (డిస్క్రిప్టివ్) రాత పరీక్ష .....

-ఇది కేవలం అర్హత పరీక్ష అయినప్పటికీ ముందు నుంచే ప్రిపేర్ కావాలి.
-పేపర్-2లో ప్రధానంగా షార్ట్ ఎస్సే, లెటర్ రైటింగ్ నుంచి 50 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. 30 నిమిషాల వ్యవధిలో పూర్తిచేయాలి. ఆ వ్యవధిలో రాయగలిగిన ప్రశ్నలనే అడుగుతారు. ఈ పరీక్షను ఇంగ్లిష్/ హిందీలో లేదా గుర్తింపు పొందిన (రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారం) ఏదైనా ప్రాంతీయ భాషలో రాయవచ్చు. కనీస అర్హత మార్కులను సాధించాలి. అభ్యర్థికి సంబంధిత భాషలో ప్రాథమిక పరిజ్ఞానం ఏ మేరకు ఉందో ఈ పరీక్ష ద్వారా పరిశీలిస్తారు.
-పేపర్-1లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి పేపర్-2కు ఎంపిక చేస్తారు.
-పేపర్-1లో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కుల కోతవిధిస్తారు.
-పేపర్-1లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. పేపర్-2 కేవలం క్వాలిఫయింగ్ పరీక్ష మాత్రమే.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 29 (సాయంత్రం 5 గంటల వరకు)
-పేపర్-1 పరీక్ష తేదీ: ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 6 వరకు
-పేపర్-2 పరీక్ష తేదీ: నవంబర్ 17
-వెబ్‌సైట్: http://ssconline.nic.in

పరీక్షకు కావల్సిన నైఫుణ్యాలు

-సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సాధించడానికి అకుంఠిత దీక్ష, బలమైన స్వీయ ఉత్సాహం ఉండాలి.
-రీజనింగ్, ఇంగ్లిష్, అర్థమెటిక్, జనరల్ అవేర్‌నెస్‌కు సంబంధించిన కొత్త విషయాలు తెలుసుకోవాలి.
-టైమ్ మేనేజ్‌మెంట్‌ను పాటించాలి. విశ్లేషణాత్మక నైపుణ్యాలు కలిగి ఉండాలి. ఇచ్చిన సమస్యపై అనుకూల, వ్యతిరేక వాదనలు, సమస్యలను తార్కికంగా విశ్లేశించి సరైన పరిష్కారం కనుగొనే సామర్థ్య ఉండాలి.
-పరీక్ష పేపర్‌ను 100 శాతం సమాధానాలు రాయగలమనే ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టాలి. మొదట కచ్చితంగా తెలిసిన ప్రశ్నలకు, తర్వాత మిగతావాటిని సాధనచేస్తూ సమాధానం గుర్తించాలి. నెగెటివ్ మార్కింగ్ ఉంది. కాబట్టి గుడ్డిగా సమాధానం గుర్తించవద్దు.

కటాఫ్ స్కోర్: పేపర్-1లోని ప్రతి విభాగంలో కనీస అర్హత మార్కులు సాధించినవారినే పేపర్-2కు అనుమతిస్తారు. అర్హత మార్కులను ఎస్‌ఎస్‌సీ నార్మలైజేషన్ పద్ధతి ద్వారా నిర్ణయిస్తుంది.

-తన్నీరు వెంకటేశ్వర్లు

604
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles