ఇంటర్ తర్వాత ఇష్టంగా


Mon,May 20, 2019 12:32 AM

హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, టూరిజం కోర్సులు
ఇంటర్ అయిపోయింది. సెలవులు కూడా అయిపోవస్తున్నాయి. ఇంటర్ పాసయ్యాం ఇప్పుడు ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటారు. అలా ఆలోచించుకుంటూ ఏ కోర్సు పడితే ఆ కోర్సు చేయవద్దు. ఇంటర్ తర్వాత మనకు ఇష్టమైన, అభిరుచికి అనుగుణంగా కోర్సును ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, టూరిజం వంటి వాటిపై ఆసక్తి ఉన్నవారు వీటికి సంబంధించిన కోర్సులు చేయవచ్చు. ఈ కోర్సులు చేస్తే భవిష్యత్తుకు ఢోకా ఉండదు. హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, టూరిజం కోర్సుల గురించి ప్రత్యేక కథనం.
GDHM-AHLA

హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్

-దీన్నే ఆతిథ్య రంగం అంటారు. ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో ఆతిథ్య రంగం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. లాభదాయకమైన కెరీర్‌గా కూడా వేగంగా వృద్ధిచెందుతుంది. హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్.. హోట ల్, ప్రయాణ, పర్యాటక సంబంధిత పరిశ్రమలకు చాలా అవసరం. హౌస్‌కీపింగ్, క్యాటరింగ్, కస్టమర్‌కేర్ కూడా హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో భాగమే.
-ఆతిథ్య నిర్వహణలో మెళకువలపై హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ ఇస్తారు. దీనిలో ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్, ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్, హౌస్‌కీపింగ్‌లపై అధ్యయనం చేస్తారు. ఈ కోర్సులో సేల్స్ అండ్ మార్కెటింగ్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెం ట్, హోటల్ అండ్ క్యాటరింగ్ లా, ప్రాపర్టీ మేనేజ్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్, కంప్యూటర్స్ వంటి వాటిపై కూడా పరిజ్ఞానం అందిస్తారు.

నైపుణ్యాలు

-అంతర్గత నైపుణ్యాలు, అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్, స్వీయ క్రమశిక్షణ కోసం ఉత్సాహం కలిగి ఉండాలి.
-అతిథుల పట్ల మర్యాదగా నడుచుకుం టూ, సహకారం అందిస్తూ, గౌరవప్రదం గా ఉండాలి. అతిథి విమర్శలను ఎదుర్కొనే సహనం కూడా ఉండాలి.

ఉద్యోగాలు

-హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ కోర్సులు చేసినవారికి ఎయిర్‌లైన్ అండ్ రైల్వే ట్రా వెల్, కాన్ఫరెన్సెస్ అండ్ కన్వెన్షన్స్ సెంట ర్స్, ట్రావెల్ ఏజెన్సీస్, టూరిస్ట్ ఆఫీసెస్ అండ్ మినిస్ట్రీస్ ఆఫ్ టూరిజం, టూర్ ఆపరేటర్స్, స్పా అండ్ వెల్‌నెస్ సెంటర్స్, క్రూయిజ్, క్యాటరింగ్ కంపెనీలు, బార్, ప్రైవేట్ క్లబ్బులు, మ్యూజియాలు, థీమ్ పార్కులు, రియల్ ఎస్టేట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, హోటల్ డెవలప్‌మెంట్, నిర్మాణ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తుంది.

టూరిజం

-కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రకృతి అందాలతో కనువిందు చేస్తున్న భారతావనిలో పర్యాటక రంగం దినాదినాభివృద్ధి చెందుతుంది. నిత్యం పర్యాటకులతో కళకళాడుతుంది. దీంతో పర్యాటకులకు సేవలందించేవారి కోసం టూరిజం ఎదురుచూస్తుంది. ఈ రంగాన్ని వృత్తిగా ఎంచుకున్నవారికి అవకాశాలు అందివస్తున్నాయి.
-గతంలో వేర్వేరుగా ఉన్న హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, టూరి జం విభాగాలు ఇప్పుడు దాదాపు ఒకే గొడుగు కిందకు వచ్చా యి. పర్యాటకులకు ప్రదేశాలను చూపే బాధ్యతలను టూరిజం విభాగం నిర్వర్తిస్తే, వారికి సరైన సదుపాయాలు, సేవలు అందించడం హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ చూసుకుంటుంది.

ఉపాధి

-పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ప్రపంచ దేశాలను చూడాలని చాలామంది కోరుకుంటున్నారు. వారికి ఆ దేశంలోని చారిత్రక, పర్యాటక ప్రదేశాలు, సంస్కృతుల గురించి క్షుణ్ణంగా తెలిసినవారి అవసరం ఉంటుంది. దీంతో టూరిజం శాఖలు, ట్రావెల్ ఏజెన్సీలు టూరిజం కోర్సులు చేసినవారికి మంచి వేతనాలు ఇచ్చి నియమించుకుంటున్నాయి.
-మధ్యప్రదేశ్, గోవా, ఉత్తరప్రదేశ్, వివిధ రాష్ర్టాల పర్యాటక అభివృద్ధి సంస్థలతో పాటు ఇండియా టూరిజం డెవలప్‌మెం ట్ కార్పొరేషన్ (ఐఐటీడీ)లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

ఉద్యోగ హోదాలు

-టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు, అడ్వెంచర్ అండ్ లీజర్ టూరిజం ప్రొవైడర్స్, టూర్ ఆపరేటర్ ఫర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీ, అవుట్‌బాండ్ టూర్ ఎగ్జిక్యూటివ్, ట్రావెల్ ఏజెన్సీ స్టాఫ్, టూర్, ట్రావెల్ కన్సల్టెంట్, ఫ్రీలాన్స్ టూర్ మేనేజర్/టూర్ గైడ్, ఎగ్జిక్యూటివ్ ఇన్‌బౌండ్ టూర్, టూర్ ఆపరేషన్స్ మేనేజర్, టూరిజం ఆఫీసర్, ఎయిర్‌లైన్ ఎంప్లాయీ/ఎయిర్‌పోర్ట్ స్టాఫ్, టూరిజం ప్రమోటర్/మార్కెటర్, టికెటింగ్ స్టాఫ్ వంటి వివిధ హోదాల్లో ఉపాధి లభిస్తుంది.

కోర్సులు - సంస్థలు

బీఏ (ఆనర్స్) ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం
-ఈ కోర్సును గార్డెన్ సిటీ యూనివర్సిటీ (బెంగళూరు), జీడీ గోయెంకా యూనివర్సిటీ (గుర్‌గావ్-హర్యానా), క్రిష్‌నాథ్ కాలేజ్ (బెర్హంపూర్-పశ్చిమబెంగాల్), నలంద ఓపెన్ యూనివర్సిటీ (పాట్నా-బీహార్), ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ (న్యూఢిల్లీ) అందిస్తున్నాయి.

బీఏ ఇన్ మేనేజ్‌మెంట్ ఆఫ్ టూరిజం బిజినెస్

-ఈ కోర్సు ఐఐఎస్ యూనివర్సిటీ-ఇంటర్నేషన్ కాలేజ్ ఫర్ గర్ల్స్ (జైపూర్-రాజస్థాన్)లో అందుబాటులో ఉంది.

బీఏ టూరిజం స్టడీస్

-ఈ కోర్సును ఏఈటీ కాలేజ్ (బెంగళూరు), ఆంబిషన్ పాయింట్ అకాడమీ (కోల్‌కతా), అమైటీ యూనివర్సిటీ (ముంబై, నోయిడా), బీఎం రుయా గర్ల్స్ కాలేజ్ (ముంబై), బుందేల్‌ఖండ్ యూనివర్సిటీ (ఝాన్సీ-ఉత్తరప్రదేశ్), డీఎల్‌వీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (డెహ్రాడూన్-ఉత్తరాఖండ్), డా. బీఆర్ అంబేద్కర్ ఫస్ట్ గ్రేడ్ ఈవినింగ్ కాలేజ్, గార్డెన్ సిటీ కాలేజ్, గార్డెన్ సిటీ యూనివర్సిటీ (బెంగళూరు) ఆఫర్ చేస్తున్నాయి.

బీఏ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్

-ఈ కోర్సును ఏబీఎస్ అకాడమీ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, అడ్వాన్స్‌డ్ ఇన్ఫర్మేషన్ & మేనేజ్‌మెంట్ స్టడీస్ (బర్ధమన్-పశ్చిమబెంగాల్), అగర్‌చంద్ మన్ముల్ జైన్ కాలేజ్, అన్నా ఆదర్శ్ కాలేజ్ ఫర్ ఉమెన్ (చెన్నై), ఏబీ అబ్దురహిమాన్ హాజి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, బైతుల్ ఇజ్జా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ (కోజికోడ్-కేరళ), కొలంబస్ ట్రావెల్ అకాడమీ (ముం బై, పుణె-మహారాష్ట్ర, రాజ్‌కోట్-గుజరాత్) అందిస్తున్నాయి.

బీఏ ట్రావెల్ అండ్ టూరిజం

-ఈ కోర్సు కాకతీయ యూనివర్సిటీ (వరంగల్), గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ (శ్రీకాకుళం-ఏపీ), గవర్నమెంట్ తిలక్ పీజీ కాలేజ్ (కట్ని-మధ్యప్రదేశ్), కస్తూరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (కోయంబత్తూర్-తమిళనాడు), మహేంద్ర నారాయణ్ చౌద రి బాలికా మహావిద్యాలయ (నల్‌బరి-అసోం), పోకర్ సాహి బ్ మెమోరియల్ ఆర్ఫనేజ్ కాలేజ్ (మళప్పురం-కేరళ), తమిళనాడు ఓపెన్ యూనివర్సిటీ (చెన్నై), యూనివర్సిటీ ఆఫ్ కాలికట్ (కేరళ)లలో అందుబాటులో ఉంది.

బీబీఏ ఎయిర్ ట్రావెల్ మేనేజ్‌మెంట్

-ఏషియా పసిఫిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (అహ్మదాబాద్-గుజరాత్) ఈ కోర్సును అందిస్తున్నాయి.

బీబీఏ ఏవియేషన్ ఆపరేషన్స్

-పటియాలా ఏవియేషన్ క్లబ్, (పటియాలా-పంజాబ్), టీఎంఐ అకాడమీ ఆఫ్ ట్రావెల్, టూరిజం అండ్ ఏవియేషన్ స్టడీస్ (జైపూర్-రాజస్థాన్), ట్రేడ్ వింగ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (న్యూఢిల్లీ, ఛతర్‌పూర్-మధ్యప్రదేశ్, కటక్-ఒడిశా, బెంగళూరు, ఔరంగాబాద్-మహారాష్ట్ర, పుణె-మహారాష్ట్ర, జలంధర్-పంజాబ్, జమ్ముకశ్మీర్) ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి.

బీబీఏ (ఆనర్స్) ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్

-బెంగాల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (హుగ్లీ-పశ్చిమ బెంగాల్), సీజడ్ పటేల్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ అండ్ మేనేజ్‌మెంట్ (వల్లభ్ విద్యానగర్-గుజరాత్), హిందుస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (చెన్నై) కాలేజీల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది.

బీకాం (టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్)

-బేసిలియోస్ పౌలోస్ సెకండ్ కాలేజ్, సీఈటీ కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎర్నాకుళం-కేరళ), భోపాల్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్, కెరీర్ కాలేజ్ (భోపాల్), సీహెచ్‌ఎంఎం కాలేజ్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీస్, ఇమ్మాన్యుయేల్ కాలేజ్ (తిరువనంతపురం-కేరళ), సీహెచ్‌ఆర్‌ఐఎస్‌టీ-డీమ్డ్ యూనివర్సిటీ (బెంగళూరు, త్రివేండ్రం-కేరళ), డీఏవీ సెంటినరీ కాలేజ్ (ఫరీదాబాద్-హర్యానా), గవర్నమెంట్ పీజీ కాలేజ్ (భోపాల్-మధ్యప్రదేశ్)లు ఈ కోర్సును అందిస్తున్నాయి.

బీఎస్సీ (టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్)

-చండీగర్ యూనివర్సిటీ (మొహాలి-పంజాబ్), మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ అటామనస్ (చెన్నై), నలంద కాలేజ్ (బీహార్), పటియాలా ఏవియేషన్ క్లబ్ (పంజాబ్), క్వీన్ మేరీస్ కాలేజ్ అటానమస్ (చెన్నై), ఆర్‌ఐఎంటీ యూనివర్సిటీ (గోవింద్‌గర్-పంజాబ్), రాయల్ గ్లోబల్ యూనివర్సిటీ (గువాహటి-అసోం), యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (మొహాలి-పంజాబ్)లలో ఈ కోర్సు ఉంది.

బ్యాచిలర్ ఆఫ్ టూరిజం స్టడీస్

-అడ్వాన్స్‌డ్ ఫుడ్ క్రాఫ్ట్ ఇన్‌స్టిట్యూట్ (డెహ్రాడూన్-ఉత్తరాఖండ్), అల్ అమీన్ కాలేజ్ ఎదతల (ఎర్నాకుళం-కేరళ), అల్ అజార్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, హోలిక్రాస్ కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ, జేపీఎం కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (ఇడుక్కి-కేరళ), బిషప్ వయలిల్ మెమోరియల్ హోలి క్రాస్ కాలేజ్ (కొట్టాయం-కేరళ), బుందేల్‌ఖండ్ యూనివర్సిటీ (ఝాన్సీ-ఉత్తరప్రదేశ్), ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ (న్యూఢిల్లీ) తదితర సంస్థల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది.

బీ వొకేషనల్ (టూరిజం)

-ఈ కోర్సును సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్ము (జమ్ముకశ్మీర్), చండీగర్ యూనివర్సిటీ (మొహాలి-పంజాబ్), జగన్నాథ్ యూనివర్సిటీ (జైపూర్-రాజస్థాన్), కేకే యూనివర్సిటీ (నలంద, బీహార్), సిక్కిం యూనివర్సిటీ (గ్యాంగ్‌టక్-సిక్కిం), సోనాపూర్ కాలేజ్ (గువాహటి-అసోం), సెయింట్ జేవియర్ కాలేజ్ (ముంబై) అందిస్తున్నాయి.

డిప్లొమా ఇన్ టూరిస్ట్ గైడ్

-ఇంటిగ్రేటెడ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ (హైదరాబాద్-తెలంగాణ), ఎఫర్ట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ (న్యూఢిల్లీ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ (ఉదయ్‌పూర్-రాజస్థాన్), సాయి ఎడ్యుకేషన్ సెల్ (న్యూఢిల్లీ)లలో ఈ కోర్సు అందుబాటులో ఉంది.

సర్టిఫికెట్ ఇన్ టూరిస్ట్ గైడెన్స్

-కమర్‌గావ్ కాలేజ్ (గోళఘాట్-అసోం) ఈ కోర్సును ఆఫర్ చేస్తుంది.

హాస్పిటల్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తున్న సంస్థలు

-దేశంలో చాలా కాలేజీలు ఇంటర్ అర్హతతో హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ, డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి.

ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ)

-ఇది మూడేండ్ల బ్యాచిలర్ సైన్స్ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్)ను అందిస్తుంది.

దుర్గాపూర్ సొసైటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, దుర్గాపూర్, పశ్చిమబెంగాల్

-ఇది మూడేండ్ల బ్యాచిలర్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తుంది.
-వెబ్‌సైట్: www.dsmsindia.org
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్ ఎల్ఫిన్‌స్టోన్ కాలేజ్, ముంబై
-ఇది రెండేండ్ల డిప్లొమా కోర్సును అందిస్తుంది.
-వెబ్‌సైట్: www.ihtm.in

ఎయిర్‌హోస్టెస్ అకాడమీ, ఢిల్లీ

-ఇది ఏడాది డిప్లొమా కోర్సును అందిస్తుంది.
-వెబ్‌సైట్: www.airhostessacademy.com

నిథిమ్

-హైదరాబాద్‌లో ఉన్న ఇది నాలుగేండ్ల బీబీఏ (టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్) కోర్సును నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (NITHM) అందిస్తుంది.
-50 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీలు 45 శాతం) ఇంటర్ ఉత్తీర్ణులు అర్హులు.
-వెబ్‌సైట్ www.nithm.ac.in
-ప్రస్తుతం ఈ కోర్సుకు అడ్మిషన్లు జరుగుతున్నాయి.

-సత్యం చాపల

372
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles