బిర్యానీలో ఉపయోగించే లైకేన్ ఏది?


Wed,May 22, 2019 01:28 AM

bark

బెసిడియోమైసిటిస్


-దీనిలోని పుట్టగొడుగులు (Mush rooms), బ్రాకెట్ ఫంగై/పఫ్‌బాల్స్ వీటన్నిటిని కలిపి సాధారణంగా క్లబ్‌ఫంగై (Club Fungi) అంటారు.
-ఇవి మట్టి, దుంగలు (logs), చెట్టు మోదులు (tree stumps) సజీవ మొక్కల శరీరాల్లో పరాన్నజీవులుగా పెరుగుతాయి.
-వీటిలో లైంగిక అవయవాలు ఉండవు (కానీ శిలీంధ్ర తంతువుల/కణాల సంయోగం ద్వారా ప్లాస్మోగమీ జరుగుతుంది)
ఉదాహరణలు
ఎ. పక్సీనియా - కుంకుమ తెగులు శిలీంధ్రం
బి. యుస్టిలాగో - కాటుక తెగులు శిలీంధ్రం
సి. పాలీపోరస్ - బ్రాకెట్ శిలీంధ్రం
డి. లైకోపెర్డాన్ - పఫ్‌బాల్
ఇ. పుట్ట గొడుగులు (Mushrooms)- వీటి పెంపకాన్ని మష్రూమ్ కల్చర్ అంటారు. ఇవి స్థూలకాయులకు ముఖ్యమైన ఆహారం. ఎందుకంటే వీటిలో కొలెస్టిరాల్, కార్బోహైడ్రేట్‌లు తక్కువగా ఉండి ప్రొటీన్స్, మినరల్స్, విటమిన్‌లు, పీచు ఎక్కువగా ఉంటాయి.
-ఆహారంగా తీసుకునే పుట్టగొడుగులు- అగారికస్ జాతులు (అగారికస్ బైస్పోరస్ అనే పుట్టగొడుగును ఎక్కువగా ఉపయోగిస్తారు)
-విషపూరిత పుట్టగొడుగులు- Toad stools/ అమానిటా జాతులు. వీటిలో మస్కరైన్ కాప్రాయిన్, సీలోసైబిన్ అనే విషపదార్థాలు ఉంటాయి.

డ్యుటిరోమైసిటిస్


-వీటిని ఇంపర్ఫెక్ట్ ఫంగై (Imperfect Fungi) అని పిలుస్తారు.

ఉదాహరణలు


ఎ. ఆల్టర్నేరియా- మాడు వ్యాధిని కలుగజేస్తుంది.
బి. కొల్లెటోట్రైకమ్- చెరుకులో ఎర్రకుళ్లు తెగులును కలుగజేస్తుంది.
సి. ట్రైకోడెర్మా

లైకేన్లు (Lichens)


-వీటి అధ్యయనాన్ని లైకెనాలజీ అంటారు.
-ఒక శైవలం, ఒక శిలీంధ్రం సన్నిహితంగా కలిసి ఉండటం వల్ల ఏర్పడిన మొక్కలను లైకేన్స్ అంటారు.
-లైకేన్‌ల దేహాన్ని థాలస్ అంటారు. దీనిలో శైవల భాగస్వా మిని పైకోబయాంట్ అని, శిలీంధ్ర భాగస్వామిని మైకోబ యాంట్ అని పిలుస్తారు.
-భారతదేశ ప్రముఖ లైకెన్ శాస్త్రవేత్త- అవస్థ పట్వర్ధన్.
-ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రముఖ లైకేన్ శాస్త్రవేత్త- ఆచార్య మనోహరాచారి.
-లైకేన్‌లలోని శిలీంధ్రభాగస్వాములు ఆస్కో, బెసిడియో, డ్యుటిరో మైకోటినాకు చెందినవి.
-లైకేన్‌లలోని శైవల భాగస్వాములు క్లోరోఫైసీ, సయనోఫైసీ తరగతికి చెందినవి.
-లైకేన్‌లను కాలుష్య సూచికలుగా ఉపయోగిస్తారు.
-చెట్ల బోదెలు, బెరడులపై పెరిగే లైకేన్‌లను కార్టికోలస్ అని, కలపపై పెరిగే లైకేన్‌లను లిగ్నికోలస్ అని, భూమి మీద పెరిగే లైకేన్లను టెరికోలస్ అని, రాళ్లపై పెరిగే లైకేన్లను సాక్సికోలస్ అని అంటారు.

లైకేన్ల ఉపయోగాలు


-వీటిని ఆమ్లాలు, క్షారాలను గుర్తించడానికి వినియోగించే లిట్మస్ పేపర్ తయారీకి ఉపయోగిస్తారు.
-కాలుష్య సూచికలుగా, జీవ సూచికలుగా ఉపయోగిస్తారు.
-అంబెల్లి కేరియా అనే లైకేన్‌ను కామెర్ల వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారు.
-బిర్యానీ వంటి ఆహార పదార్థాల్లో ఫార్మీలియా అనే లైకేన్‌ను రాక్‌ఫ్లవర్‌గా, సుగంధ ద్రవ్యాలుగా వాడుతారు.
-దగ్గుమందు తయారీలో ఆస్నియా అనే లైకేన్‌ను, రేబిస్ నివారణలో పెల్టిజెరాకానినా అనే లైకేన్‌ను వాడుతారు.

బ్రయోఫైటా


-ఈ మొక్కలను లివర్‌వర్ట్‌లు, హార్న్‌వర్ట్‌లు, మాస్‌లు అంటారు.
-ఈ మొక్కల గురించిన అధ్యయనాన్ని బ్రయాలజీ అంటారు.
-ఈ మొక్కలను వృక్షరాజ్యపు ఉభయచరాలు (Amphi-bians of the plant kingdom) అంటారు. కారణం ఇవి నీటిలోనూ, తడిసిన నేలపైన పెరుగుతాయి.
-ఈ మొక్కలకు అధిక జలధానశక్తి ఉండటంవల్ల ఇవి ఉన్న ప్రదేశంలో నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది.
-ఇవి మొట్టమొదటి నేలయుత మొక్కలు.
-ఈ మొక్కల్లో మొదటగా లైంగిక అవయవాలు ఏర్పడ్డా యి. పురుషలైంగిక అవయవాన్ని ఆంథరీడియం, స్త్రీ లైంగిక అవయవాన్ని ఆర్కిగోనియం అంటారు.
-వీటి జీవితచక్రంలో సంయోగబీజద దశ- ఏకస్థితికం,
- సిద్దబీజద దశ- ద్వయస్థితికం అనే రెండు ఏకాంతర
- దశలు ఉన్నాయి.
-ఈ మొక్కల్లో మొదటిసారిగా పిండం ఏర్పడింది (పిండయుత మొక్కలు).
-ఈ మొక్కలకు నిజమైన వేర్లు, కాండాలు, పత్రాలు ఉండవు. ఈ మొక్కలకు వేరులాంటి మూల తంతువులు, పత్రం లాంటి పిల్లాయిడ్లు (పత్రాభాలు), కాండం లాంటి కాలాయిడ్లు (కాండాభాలు) ఉంటాయి.
-ఈ మొక్కల శరీరం మృదు కణజాలాన్ని కలిగి ఉంటుంది.
-వీటిని హెపాటికాప్సిడా (లివర్ వర్ట్‌లు), ఆంథోసెరటాప్సి డా (హార్న్‌వర్ట్‌లు), బ్రయాప్సిడా (మాస్‌లు) అనే మూడు తరగతులుగా విభజించవచ్చు.

హెపాటికాప్సిడా (లివర్‌వర్ట్‌లు)


-వీటిని కాలేయాకృతి మొక్కలు అంటారు.
ఉదా: రిక్సియా, మార్కాన్షియా

ఆంథోసిరటాప్సిడా (హార్న్‌వర్ట్‌లు)


ఇవి కొమ్ము ఆకృతిలో ఉంటాయి.
ఉదా: ఆంథోసిరాస్

ఆంథోసిరటాప్సిడా (హార్న్‌వర్ట్‌లు)


బ్రయాప్సిడా (మాస్‌లు)


-ఈ మొక్కలు నేలపై దళసరిగా పెరుగుతాయి.
ఉదా: ఫునేరియా (Cord moss), పాలీట్రైకం (Haircap moss), స్ఫాగ్నం (Peat moss)

బ్రయోఫైట్‌ల ఆర్థిక ప్రాముఖ్యత


-స్ఫాగ్నం అనే మాస్ మొక్కలను ఇంధనంగా వాడుతారు.
-మాస్ మొక్కలు లైకేన్లతో కలిసి బండరాళ్లపై సహనివేశానికి తోడ్పడే మొదటి జీవులు (జీవావరణ అనుక్రమంలో తోడ్పడుతాయి).
-మాస్ మొక్కలు మృత్తిక ఉపరితలంపై ఒక మందమైన చాపవంటి నిర్మాణంగా ఏర్పడి వాన ప్రభావాన్ని తగ్గించి మృత్తిక క్రమక్షయాన్ని నివారిస్తాయి.

టెరిడోఫైటా


-క్లబ్‌మాస్‌లు, హార్స్‌టెయిల్స్, ఫెర్న్‌లు మొదలైనవి టెరిడోఫైటా మొక్కలు.
-ఈ మొక్కల గురించిన అధ్యయనాన్ని టెరిడాలజి అంటారు. వీటిని అలంకరణ కోసం పెంచుతారు.
-వీటిని వృక్షరాజ్యపు సరీసృపాలు/పాములు (Snakes/ Reptiles of the plant kingdom) అంటారు.
-ఇవి నాళికా కణజాలాలను (Vascular tissues) కలిగిన మొదటి మొక్కలు. అంటే దారువు (Xylem), పోషక కణజాలం (Phlome) కలిగిన మొదటి మొక్కలు.
-దారువు- వేర్లు పీల్చుకున్న నీటిని, ఖనిజ లవణాలను మొక్కలోని ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది.
-పోషక కణజాలం- పత్రంలో తయారైన పిండి పదార్థా లు/పోషక పదార్థాలు/ఆహారపదార్థాలను మొక్కలోని ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది.
-ఇవి మొదటి నిజమైన నేలయుత మొక్కలు.
-ఈ మొక్కలు నిజమైన వేర్లు, కాండం, పత్రాలను కలిగి ఉంటాయి.
ఉదా:
-సైలోటం, లైకోపోడియం
-సెలాజినెల్లా, ఈక్విజిటం (Horse Tail)
-డ్రయోప్టెరిస్, టెరిస్, ఎడియాంటం (Walking Fern)
-మార్సీలియా, అజోల్లా, సాల్వీనియా (వీటిని Water Ferns అంటారు).
-అజొల్లా (వరి పొలాల్లో జీవ ఎరువుగా ఉపయోగిస్తారు)

పుష్పించే మొక్కలు (Phenerogams)


-ఈ మొక్కల్లో పుష్పాలు, ఫలాలు (ఆవృత బీజాల్లో), విత్తనాలు ఉంటాయి.
-వీటిని బీజయుత మొక్కలు (Spermatophytes) అంటారు.
-వీటిని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి వివృత బీజాలు, ఆవృతబీజాలు (Angeosperms).

వివృత బీజాలు


-నగ్నంగా ఉండే అండాలు ఉన్న మొక్కలను వివృత బీజాలు (Gymnosperms) అంటారు.
-ఈ మొక్కల్లో విత్తనాలు ఫలంలో కాకుండా మొక్క బహిర్గత భాగాలకు అతికి ఉంటాయి. వాటిలో ఫలాలు ఏర్పడకపోవడమే దీనికి కారణం.
-ఇవి ఎక్కువగా సమశీతోష్ణ ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో పెరుగుతాయి (హిమాలయాల్లో).
-ఇవి అత్యంత ఎత్తుకు పెరిగే మొక్కలు. ఈ మొక్కల్లో ఏర్పడే పుష్పాలను శంఖులు (Cones) అంటారు.
-వీటిలో అంకురచ్చదం ఏకస్థితికంగా ఉంటుంది.
-ఈ మొక్కల పోషక కణజాలంలో సహకణాలు ఉండవు. వీటికి బదులుగా అల్బుమీనస్ కణాలు ఉంటాయి.
ఉదాహరణలు:
-ఎ. సైకస్- దీని అండం వృక్ష సామ్రాజ్యంలో అతిపెద్దది.
- ఇది తిరుపతి కొండల్లో కనబడే ఒక మొక్క.
-బి. పైనస్- ఈ మొక్క కాండాన్ని పేపర్ తయారీకి వాడు తారు.
-ఈ మొక్క కాండంలో ఉండే రెసిన్ నాళాల నుంచి టర్పెంటైన్ అనే పదార్థం లభింస్తుంది. దీనిని వార్నిష్ తయారీలో వాడుతారు.
- సి. నీటం
-డి. గింగో(Ginkgo)- ఇది సజీవ శిలాజ మొక్క.
-ఈ. సాలిక్స్/విల్లో- దీనిని క్రికెట్ బ్యాట్లు, హాకీ హ్యండిల్ తయారీకి వాడుతారు.
-ఎఫ్. సికోయ( Red wood tree)- ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మొక్క.
-జి. దేవదారు(సిడ్రస్)- దీని కలపను రైల్వేస్లీపర్స్ తయారీకి వాడతారు.
-హెచ్. టాక్సస్-ఈ మొక్క కాండం నుంచి టాక్సాల్ అనే క్యాన్సర్ వ్యతిరేక రసాయన పదార్థం లభిస్తుంది.

terido-faita

mallesh

1867
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles