ఎస్‌బీఐలో స్పెషలిస్టు ఆఫీసర్లు


Thu,May 23, 2019 01:31 AM

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో స్పెషలిస్టు ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.
-పోస్టు: స్పెషలిస్టు క్యాడర్‌ ఆఫీసర్‌ (రెగ్యులర్‌/కాంట్రాక్టు ప్రాతిపదికన)
-విభాగాల వారీగా ఖాళీలు-అర్హతలు:
-బ్యాంక్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (బీఎంవో-2)-56 ఖాళీలు
-అర్హతలు: ఎంబీబీఎస్‌ డిగ్రీ. ఎంసీఐలో రిజిస్ట్రేషన్‌ అయిన తర్వాత కనీసం ఐదేండ్లు అనుభవం, పీజీ డిగ్రీతోపాటు మూడేండ్ల అనుభవం ఉండాలి.
-మేనేజర్‌ అనలిస్ట్‌ (ఎంఎంజీఎస్‌-3)- 1 పోస్టు
-అర్హతలు: సీఏ/ఎంబీఏ (ఫైనాన్స్‌)లేదా తత్సమాన కోర్సుతోపాటు కనీసం ఐదేండ్ల అనుభవం ఉండాలి.
-ఫ్రాడ్‌ మేనేజ్‌మెంట్‌ అడ్వైజర్‌ - 3 పోస్టులు. వీటిని కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
-అర్హతలు: పదవీ విరమణ చేసిన ఐపీఎస్‌ లేదా రాష్ట్రస్థాయిలో అయితే డీఎస్‌పీ స్థాయిలో పనిచేసినవారు అర్హులు. కనీసం ఐదేండ్లు అనుభవం ఉండాలి.
-వయస్సు: మెడికల్‌ ఆఫీసర్‌, మేనేజర్‌ అనలిస్ట్‌ పోస్టులకు 27 ఏండ్ల నుంచి 35 మధ్య ఉన్నవారు అర్హులు.
-జీతభత్యాలు: మెడికల్‌ ఆఫీసర్‌కు సీటీసీ రూ.13.30 నుంచి 15.25 లక్షల వరకు ఉంటుంది.
-మేనేజర్‌ అనలిస్ట్‌ పోస్టుకు - రూ.42020-51490/-
-ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌ చేసి ఇంటర్వ్యూల ద్వారా తుది ఎంపిక చేస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూన్‌ 12
-ఫీజు: జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌లకు రూ.750/- ఎస్సీ/ఎస్టీలకు రూ.125/-
-వెబ్‌సైట్‌: https://bank.sbi/careers

638
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles