ఈపీఎఫ్‌వోలో 280 ఖాళీలు


Sun,May 26, 2019 01:32 AM

న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
dipp
-పోస్టు పేరు: అసిస్టెంట్
-మొత్తం ఖాళీలు: 280 (ఎస్సీ-42, ఎస్టీ-21, ఓబీసీ-76, ఈడబ్ల్యూఎస్-28, జనరల్-113)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 జూన్ 25 నాటికి 20 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.
-పేస్కేల్: రూ. 44,900/- (పే మ్యాట్రిక్స్ లెవల్ 7 ప్రకారం)
-ఎగ్జామినేషన్ ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ. 500/-(ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులకు రూ. 250/-)
-ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్)
-ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు ఉంటుంది. దీనిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్-30, రీజనింగ్ ఎబిలిటీ-35, న్యూమరికల్ ఆప్టిట్యూడ్-35 ప్రశ్నలు ఇస్తారు.
-మెయిన్ ఎగ్జామ్ (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్) విధానంలో ఉంటుంది. దీనిలో రీజనింగ్/ఇంటెలిజెన్స్-40, జనరల్/ఎకానమీ/ఫైనాన్షియల్ అవేర్‌నెస్-40, ఇంగ్లిష్ లాంగ్వేజ్-30, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-40 ప్రశ్నలు ఇస్తారు. డిస్క్రిప్టివ్ పేపర్ 30 మార్కులకు ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: మే 30
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 25
-హాల్‌టికెట్ల డౌన్‌లోడింగ్: జూలై 20 నుంచి 30
-ప్రిలిమినరీ ఎగ్జామినేషన్: జూలై 30, 31
-వెబ్‌సైట్: www.epfindia.gov.in

1451
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles