ఎన్‌ఐఈఎల్‌ఐటీలో ఎంటెక్ (ఈడీటీ)


Mon,May 27, 2019 12:44 AM

ఔరంగాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ)లో ఎంటెక్ పార్ట్‌టైం, ఫుల్‌టైం కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
-కోర్సులు: ఎంటెక్ (ఎలక్ట్రానిక్స్ డిజైన్ అండ్ టెక్నాలజీ) (ఫుల్‌టైం/పార్ట్‌టైం)
-ఇది రెండేండ్ల ఫుల్‌టైం/మూడేండ్ల పార్ట్‌టైం కోర్సు.
-సీట్ల సంఖ్య: ఫుల్‌టైం -25, పార్ట్‌టైం-24 ఉన్నాయి.
-అర్హతలు: పార్ట్‌టైం- కనీసం 55 శాతం మార్కులతోపాటు బీఈ/బీటెక్‌లో ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్ లేదా టెలీకమ్యూనికేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణతతోపాటు గేట్ స్కోరు ఉండాలి.
-పార్ట్‌టైం- పై అర్హతలతోపాటు విద్యాసంస్థలో పనిచేస్తున్నవారు లేదా స్పాన్సర్డ్ ఉద్యోగి అయి సంస్థకు 60 కి.మీ దూరం లోపు ఉండాలి.
నోట్: ఈ కోర్సులతోపాటు డీఈపీఎం, బీటెక్ (ఈఎస్‌ఈ) కోర్సులు ఉన్నాయి. బీటెక్ ప్రవేశాలను సీఎస్‌ఏబీ (జోసా) కౌన్సెలింగ్ ద్వారా నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 31
-హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: జూన్ 7
-వెబ్‌సైట్: http://nielit.gov.in

634
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles