కోస్ట్‌గార్డ్‌లో అసిస్టెంట్ కమాండెంట్


Mon,May 27, 2019 01:06 AM

ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో పలు బ్రాంచీల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
caost
-పోస్టు: అసిస్టెంట్ కమాండెంట్ (గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్)
బ్రాంచీల వారీగా అర్హతలు:
-జనరల్ డ్యూటీ, జనరల్ డ్యూటీ (ఎస్‌ఎస్‌ఏ) పోస్టులకు- కనీసం 60 శాతం (మొదటి సెమిస్టర్ నుంచి చివరి సెమిస్టర్ వరకు) మార్కులతో బీఈ/బీటెక్ ఉతీర్ణత లేదా డిగ్రీతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులుగా చదివి ఉండాలి.
-వయస్సు: 1995, జూలై 1 నుంచి 1999 జూన్ 30 మధ్య జన్మించి ఉండాలి.
నోట్: జనరల్ డ్యూటీ పోస్టులకు పురుషులు, జనరల్ డ్యూటీ ఎస్‌ఎస్‌ఏ పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు.
-కమర్షియల్ పైలట్ ఎంట్రీ (సీపీఎల్) (ఎస్‌ఎస్‌ఏ)- పురుషులు/మహిళలు అర్హులు, డీజీసీఏ నుంచి ప్రస్తుతం వ్యాలిడిటీ ఉన్న కమర్షియల్ పైలట్ లైసెన్స్ (సీపీఎల్) ఉండాలి. ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి.
-వయస్సు: 1995, జూలై 1 నుంచి 2001, జూన్ 30 మధ్య జన్మించి ఉండాలి.
-టెక్నికల్ (ఇంజినీరింగ్&ఎలక్ట్రికల్)-పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇంజినీరింగ్ బ్రాంచీకి నేవల్ ఆర్కిటెక్చర్/మెకానికల్ లేదా మెరైన్ లేదా ఆటోమోటివ్ లేదా మెకట్రానిక్స్/ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ లేదా మెటలర్జీ/ఏరోనాటికల్ లేదా ఏరోస్సేస్ బ్రాంచీల్లో ఉత్తీర్ణత.
-ఎలక్ట్రికల్ బ్రాంచీకి- ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ లేదా టెలీకమ్యూనికేషన్ /ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా పవర్ ఇంజినీరింగ్/పవర్ సిస్టమ్ బ్రాంచీలు ఉత్తీర్ణత.
-వయస్సు: 1995 జూలై 1 నుంచి 1999 జూన్ 30 మధ్య జన్మించి ఉండాలి.
-లా- పురుష/మహిళా అభ్యర్థులు అర్హులు. కనీసం 60 శాతం మార్కులతో లా డిగ్రీ ఉత్తీర్ణత.
-వయస్సు: 1990, జూలై 1 నుంచి 1999 జూన్ 30 మధ్య జన్మించి ఉండాలి.
నోట్: ఎస్‌ఎస్‌ఏ అంటే షార్ట్ సర్వీస్ కమిషన్. ఈ సర్వీస్ కింద మొదట 8 ఏండ్లకు తర్వాత 10 ఏండ్లకు సర్వీస్ పొడిగిస్తారు. అవసరాన్ని బట్టి మరో నాలుగేండ్లు అంటే 14 ఏండ్లు సర్వీస్ పొడిగిస్తారు.

ఎంపిక విధానం:


-స్టేజ్-1: షార్ట్‌లిస్టింగ్ చేసిన అభ్యర్థులకు ప్రిలిమినరీ ఎంపిక కింద మెంటల్ ఎబిలిటీ/కాగ్నిటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, పీపీటీ, డీటీలను నిర్వహిస్తారు. వీటిలో అర్హత సాధించిన వారికి స్టేజ్-2 ఎంపిక ఉంటుంది.
-స్టేజ్-2: సైకాలజీ టెస్ట్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూలతో పాటు అన్ని సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేస్తారు.

శారీరక ప్రమాణాలు:


-పురుషులు- కనీసం 157 సెం.మీ ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ ఛాతీతోపాటు గాలిపీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
-మహిళలు- కనీసం 152 సెం.మీ ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూన్ 4
-వెబ్‌సైట్: www.joinindiancoastguard.gov.in

887
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles