బీధీమా కొలువులు


Mon,May 27, 2019 01:17 AM

-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూన్ 9
-కాల్ లెటర్ డౌన్‌లోడింగ్ ప్రారంభం: జూన్ 29 నుంచి
-ప్రిలిమినరీ ఆన్‌లైన్ పరీక్ష: జూలై 6 నుంచి 13 వరకు
-ఆన్‌లైన్ మెయిన్స్ పరీక్ష: ఆగస్ట్ 10

సుమారుగా 8000కు పైగా పోస్టులతో ఎల్‌ఐసీ అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో ఎల్‌ఐసీ సెంట్రల్ జోన్ హైదరాబాద్‌లో 1250 ఖాళీలు ఉన్నాయి. ప్రిలిమినరీ, మెయిన్స్ అంటూ రెండు దశల్లో జరిగే ఈ పరీక్షలకు ప్రణాళిక ప్రకారం సిద్ధం అయితే తేలికగా ఉద్యోగం సాధించవచ్చు. పరీక్షకు అభ్యర్థులను మూడు కేటగిరీలుగా విభజించారు. ఓపెన్ మార్కెట్ కేటగిరీ, ఏజంట్స్ కేటగిరీ, ఎంప్లాయిస్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు ప్రిలిమ్స్ పరీక్ష విధానాన్ని పరిశీలిస్తే....
bbb

mains

mains1

ప్రిలిమ్స్ పరీక్ష విధానం


-ప్రిలిమ్స్ పరీక్ష జూలై 6 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు . ఒకవేళ జూలై 6న పరీక్ష నిర్వహిస్తే జూన్ 1 నుంచి గణిస్తే కేవలం 35 రోజుల సమయం ఉంటుంది. ఈ సమయాన్ని ఒక ప్రణాళిక ప్రకారం సద్వినియోగం చేసుకుంటే విజయం సాధ్యం. ఇప్పటికే ప్రాథమిక అంశాలపై పట్టు సాధించిన వాళ్లు నేరుగా మాక్ టెస్ట్‌లు రాయడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నిత్యం ఒకటి లేదా రెండు మాక్ టెస్ట్‌లు రాయాలి. ఎప్పటికప్పుడు స్కోర్‌ను సరిచూసుకుంటూ ఎక్కువగా తప్పులు జరుగుతున్న అంశాలను అధ్యయనం చేయాలి. ప్రాథమిక అంశాలపై పట్టులేని వాళ్లు వాటిని అధ్యయనం చేయడానికి కనీసంగా ఒక వారం రోజులు కేటాయించాలి. రీజనింగ్ అనే విభాగంలో ఆల్ఫాబెట్ టెస్ట్, ర్యాంకింగ్, సీటింగ్ అరేంజ్‌మెంట్, ఫజిల్, కోడింగ్ -డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పోటీపరీక్ష కాబట్టి సాధ్యమైనన్ని ఎక్కువ ప్రశ్నలకు సమాధానం కనుగొనాలి. కాబట్టి వేగంగా సమాధానాలు రాబట్టేలా ప్రాక్టీస్ చేయాలి. రీజనింగ్ విభాగానికి సంబంధించి ఆల్ఫాబెట్ టెస్ట్, ర్యాంకింగ్ అంశాలకు దాదాపుగా ఒకే తరహా తార్కిక జ్ఞానం (లాజిక్) అవసరం అవుతుంది. ఇలా ఉమ్మడి అంశాలను ఎంపిక చేసుకొని సిద్ధం కావాలి. షార్ట్‌కట్స్ కూడా నేర్చుకోవాలి. ఉదాహరణకు కింది ప్రశ్నను పరిశీలించండి
Which of the following alphabet is the 6th to the right of 15th from left?
-పై ప్రశ్నలో అడిగింది పరిశీలిస్తే, ఆంగ్ల అక్షరమాలలో ఎడమ నుంచి 15వ అక్షరానికి కుడివైపున ఆరో అక్షరం ఏది అని. ఎడమ వైపు నుంచి అంటే ఆంగ్లఅక్షర మాల ప్రారంభం నుంచి (ఏ నుంచి), ముందుగా 15వ అక్షరం గుర్తించి, దానికి కుడిదిశగా ఆరో అక్షరాన్ని గుర్తించాలి. పరీక్ష హాలులో ఏ నుంచి జెడ్ వరకు రాసుకుని, ముందుగా పదిహేనో అక్షరాన్ని గుర్తించి, దానికి కుడివైపు అంటే జెడ్ దిశగా ఆరో అక్షరాన్ని గుర్తిస్తూ వెళితే చాలా సమయం వృథా అవుతుంది. కాబట్టి వేగంగా ఈ తరహా సమస్యలకు సమాధానం గుర్తించాలి. ఇందులో చిన్న లాజిక్ ఉంది, ఏడమ వైపు నుంచి 15వ అక్షరానికి కుడి వైపున ఆరో అక్షరం అంటే 15+6=21, ఏడమ వైపు నుంచి 21వ అక్షరం గుర్తించాలి. కాబట్టి సరైన సమాధానం U అవుతుంది. అయితే EJOTY అనే అక్షరాలను గుర్తుంచుకుంటే ఇంకా వేగంగా రాబట్టవచ్చు. ఇందులో E (5)J(10)O(15)T(20)Y(25) గా ఉంటాయి. 21వ అక్షరం గుర్తించాలంటే, ఏ నుంచి ప్రారంభించాల్సిన అవసరం లేదు, 21వ అక్షరం, 20వ అక్షరం అయిన టీ తర్వాత వస్తుంది కాబట్టి, దానిని సమాధానంగా గుర్తించాలి. ఈ తరహా షార్ట్‌కట్స్‌ను నేర్చుకొని ప్రాక్టీస్ చేయాలి. కాస్త అటుఇటుగా ఇదే తార్కిక పరిజ్ఞానం ర్యాంకింగ్ అనే అధ్యయనానికి కూడా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు కింది ప్రశ్నను పరిశీలించండి

In a class room Ram is the 6th to the right of Krishna, who is 15th from left, what is Rams position from left


-ఒక తరగతిగదిలో ఎడమ నుంచి కృష్ణ పదిహేనో స్థానంలో ఉన్నాడు, అతనికి కుడివైపున ఆరో స్థానంలో రామ్ ఉన్నాడు, ఎడమ వైపు నుంచి రామ్ ఎన్నో స్థానంలో ఉన్నాడు? ఇక్కడ కూడా 15+6=21 అనే లాజిక్ పని చేస్తుంది. అంటే ఆల్ఫాబెట్ టెస్ట్‌లో నేర్చుకుంది ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది. అలాగే సిట్టింగ్ అరేంజ్‌మెంట్, ఫజిల్స్‌కు ఇంచుమించు ఒకే తరహా తార్కిక పరిజ్ఞానం అవసరం అవుతుంది. ముందుగా ఇలాంటి అంశాలను గుర్తించి వాటిని సాధ్యమైనన్ని ఎక్కువ ప్రశ్నలు సాధన చేయడం ద్వారా రీజనింగ్‌లో మంచి స్కోర్ సాధించొచ్చు.
Employees

-న్యూమరికల్ ఎబిలిటీ: ఇందులో నంబర్ సిస్టమ్‌తో పాటు అర్థమెటిక్‌లో భాగంగా ఉండే సరాసరి, శాతాలు, నిష్పత్తులు, క్షేత్రమితి, సరళ, చక్రవడ్డీలు ఇలా పలు అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. పదో తరగతి స్థాయిలో ఉన్నవే ఈ అంశాలన్నీ. వేగంగా సూక్ష్మీకరించడం నేర్చుకోవాలి. ఇందుకు ప్రాక్టీస్ ఒక్కటే మార్గం. BODMAS ఆధారిత సూక్ష్మీకరణలు రోజుకు 100 నుంచి 200 వరకు ప్రాక్టీస్ చేయాలి. కేవలం షార్ట్‌కట్‌లపై ఆధారపడకుండా తార్కిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి జవాబులు రాయాలి. అర్థమెటిక్ అంశాలకు లాజిక్ చాలా కీలకం. కేవలం సూత్రాలపై ఆధారపడటం కాకుండా జవాబులు రాబట్టే పద్ధతిని అలవర్చుకోవాలి.
ఉదాహరణకు పది మంది ఒక పనిని 40 రోజుల్లో పూర్తి చేస్తే 20 మంది ఎంత కాలంలో అదే పనిని పూర్తి చేస్తారు? అనే ప్రశ్న వచ్చింది అనుకోండి. ఇక్కడ అకడమిక్ పరీక్షల రీతిలో కాకుండా వేగంగా ఆలోచించాలి. అకడమిక్ పరీక్షలో 10 మంది, ఒక్క రోజులో చేసే పని 1/40. మరి ఒక్క మనిషి అయితే ఆ పనిని 1/400, అంటే 400 రోజులలో పూర్తి చేస్తాడు. అదే 20 మంది అయితే, ఆ పనిని 400/20, అంటే మొత్తం 20 రోజుల్లో పూర్తి అవుతుంది. ఇదంతా అకడమిక్ పద్ధతి, తార్కికంగా అలోచిస్తే, 10 మంది 40 రోజుల్లో చేస్తారు, అదే 20 మంది, అంటే మ్యాన్ పవర్ సరిగ్గా రెట్టింపు అయింది, కాబట్టి పని రోజులు సగానికి తగ్గిపోతాయి, దీంతో సమాధానం 20. ఇలా తార్కికంగా ఆలోచించే పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. ఇందుకు సాధన ఒక్కటేమార్గం. సాధ్యం అయినన్ని మాక్ పరీక్షలు రాయాలి.
-ఇంగ్లిష్: ఇందులో కాంప్రెహెన్షన్, వొకాబులరీ (సినానియమ్స్, ఆంటోనిమ్స్, ఫ్రేజల్ వర్బ్స్ (పదబంధాలు), ప్రొవెర్బ్స్ (సామెతలు) చదవాలి. అలాగే జంబుల్డ్ సెంటెన్స్, సెంటెన్స్ కరెక్షన్ తదితర అంశాలు ఉంటాయి. కాంప్రెహెన్షన్‌కు ప్రాధాన్యం పెరుగుతుంది. ఆంగ్ల దినపత్రికలలో వచ్చే సంపాదకీయాలు చదువుతూ, వాటిలో విభిన్న ప్రశ్నలు వేసుకుంటూ ఉండాలి. కొత్త పదాలకు అర్థం తెలుసుకోవాలి. ఇంగ్లిష్‌లో పదబంధాలు, సామెతలు, నుడికారాలు వివిధ సందర్భాల్లో వాడే వాటిని చదువుకోవాలి. అలాగే గ్రామర్‌కు సంబంధించిన నిబంధనలు తెలుసుకోవడం ద్వారా సెంటెన్స్ కరెక్షన్స్ అంశాన్ని పూర్తి చేయవచ్చు. సింగులర్, లేదా ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఉపయోగించే వెర్బ్స్ (క్రియా), ఆ తర్వాత టెన్సెస్, ప్రిపోజిషన్లపై ఎక్కువగా దృష్టి సారించాలి.
-ప్రాథమిక అంశాలకు సంబంధించి వారం రోజులకు మించి సమయం కేటాయించరాదు. ఆ తర్వాత నిత్యం ప్రాక్టీస్ చేయాలి.
-ఏజంట్లు, ఎంప్లాయీ కేటగిరీకి కేవలం మెయిన్ పరీక్ష ఉంటుంది, ఇందులో ఉండే అంశాలు
exam

-ఇందులో రీజనింగ్, న్యూమరికల్,ఇంగ్లిష్ విభాగాల ప్రిపరేషన్, ఓపెన్ మార్కెట్ కేటగిరీ పద్ధతిలోనే ఉంటుంది. అయితే ప్రత్యేకంగా జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్‌కు సిద్ధం కావాలి. జనరల్ నాలెడ్జ్‌లో వివిధ దేశాల రాజధానులు, కరెన్సీలు, వ్యక్తులు, ఖండాలు, సముద్రాలు, వివిధ దేశాల్లో పార్లమెంట్ వ్యవస్థలు, శాస్త్ర సాంకేతిక అంశాలకు సంబంధించిన జనరల్ నాలెడ్జ్ తెలుసుకోవాలి. అలాగే కరెంట్ అఫైర్స్‌లో భాగంగా అంతర్జాతీయ, జాతీయ, ద్వైపాక్షిక, ఆర్థిక, శాస్త్రసాంకేతిక అంశాలతో పాటు వార్తల్లో వ్యక్తులు, కీలక స్థానాల్లో ఉన్న అధికారులను చదవాలి, గడిచిన సంవత్సరం కరెంట్ అఫైర్స్ చదివితే మంచిది.
-బీమా, మార్కెటింగ్‌కు సంబంధించి ప్రాథమిక అంశాలను అధ్యయనం చేయాలి

-ఇందులో అదనంగా ఉన్న అంశం ప్రాక్టీస్ &ప్రిన్స్‌పుల్ ఆఫ్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్. ఇది ఎంప్లాయీస్ కేటగిరీ కావున, వీరికి ప్రాథమిక అంశాలు తెలిసి ఉంటాయి. వాటిని మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఈ విభాగానికి అత్యధిక మార్కులు కేటాయించినందున అత్యధిక ప్రాధాన్యం ఇస్తే మంచి ఫలితాలు ఉంటుంది.

పుస్తకాలు


-రీజనింగ్- బ్యాంక్ పరీక్షలకు ఉద్దేశించి రాసిన ఏ పుస్తకం అయినా సరే ఉపయోగపడుతుంది (ఆర్‌ఎస్ అగర్వాల్ రీజనింగ్, బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్ ప్రచురణ ఎనలైటికల్ రీజనింగ్ పాండే, ఫజిల్స్ (కుందన్).
-గణితం- ఆర్‌ఎస్ అగర్వాల్ అర్థమెటిక్ లేదా బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్ ప్రచురించిన పుస్తకం (ఆథర్ టైరా) లేదా ప్రతియోగిత దర్పణ్ ప్రచురించిన పుస్తకాలు.
-ఇంగ్లిష్- టాటా ప్రచురించిన గ్రామర్ పుస్తకం లేదా ధిల్లాన పబ్లికేషన్స్ వారి ఇంగ్లిష్ పుస్తకం
-జనరల్ నాలెడ్జ్- లూసెంట్ లేదా అరిహంత్ పబ్లికేషన్స్ పుస్తకాలు
-మార్కెటింగ్- లూసెంట్ సంస్థ ఒక పుస్తకాన్ని ప్రచురించింది, ప్రాథమిక అంశాలు అందులో ఉన్నాయి
-కరెంట్ అఫైర్స్- వివిధ సంస్థలు ప్రతి రోజు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెస్తున్నాయి, వాటిని అధ్యయనం చేయవచ్చు.

-ప్రాథమిక అంశాలు సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలి. ఎక్కువ మాక్ పరీక్షలు రాసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.
-సింప్లిఫికేషన్స్ క్రమం తప్పకుండా పరీక్ష వరకు సాధన చేయాలి.
-సీటింగ్ అరేంజ్‌మెంట్, ఫజిల్స్ నిత్యం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. రీజనింగ్‌లో ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యం ఉండే అవకాశం ఉంది.
-అన్ని ఆంగ్ల దినపత్రికల సంపాదకీయాలను చదవాలి. వాటిలో అడగదగ్గ ప్రశ్నలను వేసుకొని సమాధానాలను రాబట్టాలి. కొత్త పదాలను సందర్భోచితంగా అర్థం చేసుకునేందుకు యత్నించాలి. అలాగే కొత్త పదాలను ఉపయోగించి సామెతలు, నుడికారాలు, పదబంధాలు ఉంటే తెలుసుకోవాలి. ఈ అంశాలు అన్ని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో అందుబాటులో ఉంటాయి.
rajendra-sharma

1477
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles