నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌లో


Tue,June 11, 2019 01:37 AM

sarkari-naukri
న్యూఢిల్లీలోని యువజన వ్యవహారాలు, క్రీడలు శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్‌వైకేఎస్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

- మొత్తం ఖాళీలు: 337
- అసిస్టెంట్ డైరెక్టర్/డిస్ట్రిక్ట్ యూత్ కో ఆర్డినేటర్-160, జూనియర్ కంప్యూటర్ ప్రోగ్రామర్ (జేసీపీ)-17, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్-1, అసిస్టెంట్-38, లైబ్రేరియన్-1, కంప్యూటర్ ఆపరేటర్-4, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్-58, స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-2)-23, లోయర్ డివిజన్ క్లర్క్-12, మల్టీ టాస్కింగ్ స్టాఫ్-23.
- అర్హత: డిస్ట్రిక్ట్ యూత్ కో ఆర్డినేటర్ పోస్టులకు ఏదైనా మాస్టర్ డిగ్రీ, జేసీపీ పోస్టులకు ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్) లేదా బీఈ/బీటెక్ లేదా ఎంసీఏ, స్టెనో పోస్టులకు ఇంటర్+స్టెనోగ్రఫీలో ప్రావీణ్యం ఉండాలి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ బీకాంతోపాటు అకౌంట్స్ వర్క్స్‌లో రెండేండ్ల అనుభవం ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్/టైపింగ్ స్కిల్స్‌లో పరిజ్ఞానం ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు పదోతరగతి/మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణత. మిగతా పోస్టులకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
- వయస్సు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. మిగతా పోస్టులకు 28 ఏండ్లకు మించరాదు.
- పే స్కేల్: కో ఆర్డినేటర్ రూ. 56,100-1,77, 500, అకౌంట్స్ క్లర్క్ & టైపిస్ట్ రూ. 25, 500-81,100/- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రూ. 18,000-56,900/-
- అప్లికేషన్ ఫీజు: రూ. 700/-, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీలకు ఫీజు లేదు.
- ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 26
- వెబ్‌సైట్: http://nyks.nic.in

822
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles