హోంసైన్స్ కాలేజీలో బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్


Wed,June 12, 2019 01:24 AM

రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ 2019-20 ఇయర్‌కిగాను యూనివర్సిటీ సైఫాబాద్ హోంసైన్స్ కాలేజీలో నాలుగేండ్ల బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.

-కోర్సు పేరు: బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్
-కాలేజ్ ఆఫ్ హోంసైన్స్ సైఫాబాద్, హైదరాబాద్‌లో క్లాసులు జరుగుతాయి. ఈ కోర్సు చేయడానికి బాలికలు మాత్రమే అర్హులు.
-మొత్తం సీట్ల సంఖ్య: 60
-అర్హత: బైపీసీ, ఎంపీసీ, ఎంబైపీసీ సబ్జెక్టులతో రెండేండ్ల వ్యవధిగల ఇంటర్/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. మూడేండ్ల డిప్లొమా కోర్సు (హోమ్‌సైన్స్)లో సర్టిఫికెట్ ఉన్నవారికి సూపర్‌న్యూమరీకోటాలో 10 శాతం సీట్లను కేటాయిస్తారు.
-వయస్సు: 2019 డిసెంబర్ 31 నాటికి 17 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 25 ఏండ్లు, పీహెచ్‌సీలకు 27 ఏండ్ల వరకు సడలింపు ఉంటుంది
-అప్లికేషన్ ఫీజు: రూ.1800/- (ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 900/-)
-ఎంపిక: ఇంటర్/డిప్లొమాలోని ఆప్షనల్ సబ్జెక్టు లోని వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకుని మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
-నాలుగేండ్ల బీఎస్సీ (ఆనర్స్) కోర్సు ఎంపికలో రిజర్వేషన్లు ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి ఉంటాయి.
-మొత్తం సీట్లలో 40 శాతం గ్రామీణ ప్రాంతాల్లో చదివిన అభ్యర్థులకు కేటాయించారు. నాన్ మున్సిపల్ పరిధిలోని 1 నుంచి 12వ తరగతి వరకు నాలుగేండ్లపాటు చదివి ఉండాలి.
-లోకల్ అభ్యర్థులకు 85 శాతం, నాన్‌లోకల్ అభ్యర్థులకు 15 శాతం సీట్లు భర్తీచేస్తారు.
-కోర్సు ఫీజు: రూ. 36,450/-(కోర్సు తదనంతరం రూ. 14,000/- రిఫండబుల్ ఉంటుంది)
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 4
-వెబ్‌సైట్: www.pjtsau.ac.in

325
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles