అగ్రికల్చర్ పాలిటెక్ని క్‌లో ప్రవేశాలు


Wed,June 12, 2019 01:30 AM

రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ 2019-20 విద్యా సంవత్సరానికి రెండేండ్ల/ మూడేండ్ల డిప్లొమా ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
jya-shanker-coll
-మొత్తం సీట్ల సంఖ్య: 880 (వ్యవసాయం-620, విత్తన సాంకేతిక పరిజ్ఞానం-80, సేంద్రీయ వ్యవసాయం-60, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్-110)
-అర్హత: పదోతరగతి/తత్సమాన పరీక్షలో కనీసం 5.0 గ్రేడ్ పాయింట్ (హిందీతో కలిపి)తో ఉత్తీర్ణులైనవారు అర్హులు. పదోతరగతి కంపార్ట్‌మెంట్/ ఇంటర్ ఫెయిలైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ పాసైనవారు, దానికంటే పై చదువులు చదివిన అభ్యర్థులు అర్హులుకారు. పదోతరగతిలోపు ఏదైనా నాలుగేండ్లపాటు గ్రామీణ ప్రాంతాల్లో (నాన్ మున్సిపల్ పరిధి) చదివిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
-వయస్సు: 2019 డిసెంబర్ 31 నాటికి 15 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: జనరల్/బీసీలు రూ.1100/- ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలు రూ. 600/-చెల్లించాలి.
-ఎంపిక: పదోతరగతి మార్కుల ఆధారంగా
-కోర్సు కాలపరిమితి: వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం/ సేంద్రీయ వ్యవసాయం- రెండేండ్లు. అగ్రికల్చరల్ ఇంజినీరింగ్-మూడేండ్లు
-కోర్సు ఫీజు: రూ. 12,700/-, (ప్రైవేట్ పాలిటెక్నిక్‌లో రూ. 17,200/-) చెల్లించాలి.
ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్‌ల సీట్ల వివరాలు
-నాగర్‌కర్నూల్ (పాలెం), జగిత్యాల (పొలాస), నల్లగొండ (కంపాసాగర్), సంగారెడ్డి(బసంతపూర్), ఖమ్మం(మధిర), సంగారెడ్డి (జోగిపేట), సిద్దిపేట (తోర్నాల), కరీంనగర్ (జమ్మికుంట), కామారెడ్డి(మాల్‌తుమ్మెద), నిజామాబాద్ (రుద్రూరు), హైదరాబాద్ (రాజేంద్రనగర్) వీటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది ప్రైవేట్ పాలిటెక్నిక్‌లలో ఈ కోర్సును నిర్వహిస్తున్నాయి.
-వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం, సేంద్రీయ వ్యవసాయం కోర్సుల్లో ప్రతి ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 20 సీట్లు, ప్రైవేట్ పాలిటెక్నిక్‌లలో 60 సీట్లు ఉన్నాయి. అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌లో ప్రతి ప్రైవేట్ పాలిటెక్నిక్‌లలో 30 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 4
-వెబ్‌సైట్: www.pjtsau.ac.in

1664
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles